ETV Bharat / bharat

శ్మశానాల వద్ద హౌస్​ఫుల్​ బోర్డులు - కరోనా మృతుల అంత్యక్రియలు

హౌస్​ఫుల్​ బోర్డులు సాధారణంగా ఎక్కడ కనిపిస్తాయి? సినిమా థియేటర్​, ఇతర టికెట్​ కౌంటర్ల వద్ద దర్శనమిస్తాయి. కానీ, శ్మశానవాటికల్లో హౌస్​ఫుల్​ బోర్డులు ఏర్పాటు చేసే పరిస్థితిని ఎప్పుడైనా ఊహించారా? బెంగళూరులో అదే జరుగుతోంది.

House full boards
శ్మశానాల ముందు హౌస్​ఫుల్​ బోర్డులు
author img

By

Published : May 3, 2021, 5:32 PM IST

శ్మశానాల ముందు హౌస్​ఫుల్​ బోర్డులు

కర్ణాటకలో కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. రోజుకు 30 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతుండటం, 200 మందికిపైగా మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. మృతుల సంఖ్య ఒక్కసారిగా పెరగగా.. శ్మశానాల్లో సరిపడా స్థలం లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

హౌస్​ఫుల్​ బోర్డులు..

బెంగళూరు, చామ్​రాజ్​పేట టీఆర్​ మిల్​ శ్మశాన వాటికకు ఆదివారం మొత్తం 45 మృతదేహాలు వచ్చాయి. ఏకకాలంలో కేవలం 20 మృతదేహాలను దహనం చేసే వీలుంది. అంతకు ముందే 19 మంది అంత్యక్రియలకు బుకింగ్స్​ ఉన్నాయి. దాంతో ఇకపై వచ్చే మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించలేమని నిర్ణయించుకున్న అక్కడి సిబ్బంది.. హౌస్​ఫుల్​ బోర్డు పెట్టారు.

House full boards
శ్మశానాల ముందు హౌస్​ఫుల్​ బోర్డులు

హౌస్​ఫుల్​ బోర్డులు దర్శనమిస్తుండటం వల్ల అంత్యక్రియలు జరిపేందుకు రోగుల బంధువులు ఒక శ్మశానం నుంచి మరో శ్మశానానికి తిరగాల్సిన దుస్థితి తలెత్తింది.

అంబులెన్సుల క్యూలు..

బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లోని శ్మశాన వాటికల వద్ద అంబులెన్సులు వేచి ఉన్న దృశ్యాలు కనిపించాయి. పీన్యలోని ఎస్​ఆర్​ఎస్​ శ్మశానం వద్ద సోమవారం 11 అంబులెన్సులు క్యూలో వేచి ఉన్నాయి.

ఎస్​ఆర్​ఎస్​ శ్మశాన వాటికకు సగటున రోజుకు 40 మృతదేహాలు వస్తున్నట్లు అక్కడి ఇంఛార్జి తెలిపారు.

House full boards
బారులు తీరిన అంబులెన్సులు

ఇదీ చూడండి: కరోనా 'మహా' విలయం- మరో 56వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.