ETV Bharat / bharat

'నల్లధనం నియంత్రణకు నోట్ల రద్దు సాయం'

author img

By

Published : Nov 8, 2020, 5:20 PM IST

దేశంలో నల్ల ధనాన్ని అరికట్టేందుకు, పన్ను చెల్లింపులు పెరిగేందుకు పెద్ద నోట్ల రద్దు సాయపడిందని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పన్ను చెల్లింపుల్లో పారదర్శకతకు ఊతమిచ్చిందన్నారు. నోట్ల రద్దు చేపట్టి నేటికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్​ చేశారు మోదీ.

PM Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

పెద్ద నోట్ల రద్దు చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో నల్లధనం అరికట్టేందుకు, పన్ను చెల్లింపులు పెరగటానికి, క్రమబద్ధీకరణకు తాము చేపట్టిన నోట్ల రద్దు సాయపడిందన్నారు. అలాగే.. పన్ను చెల్లింపుల్లో పారదర్శకతకు ఊతమిచ్చిందని తెలిపారు.

నోట్ల రద్దు వల్ల కలిగిన ప్రయోజనాలను తెలియజేస్తూ ట్వీట్​ చేశారు ప్రధాని మోదీ. ఈ ఫలితాలు దేశాభివృద్ధికి ఎంతోగానే ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. నోట్ల రద్దు ద్వారా ఏ విధంగా పన్ను చెల్లింపులు పెరిగాయి, పన్నులు, నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఎలా ఉపయోగపడిందనే అంశాల్ని సూచించే వివిధ గ్రాఫ్​లను ట్విట్టర్​లో పంచుకున్నారు మోదీ.

అవినీతి, నల్లధనంపై దాడి: భాజపా

గత దశాబ్ద కాలంలో.. కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో రాజ్యమేలిన అవినీతి, నల్లధనంపై నోట్ల రద్దును ఒక పెద్ద దాడిగా అభివర్ణించింది భారతీయ జనతా పార్టీ. నోట్ల రద్దును విమర్శిస్తున్న విపక్షాలను తీవ్రంగా తప్పుపట్టింది. నోట్ల రద్దు దేశానికి ఎంతో మేలు చేసిందన్నారు భాజపా జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్​ చంద్రశేఖర్​. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచటం, అసంఘటిత ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించటం, ఆదాయ పెంపు వంటివి నోట్ల రద్దుతో సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.

2016, నవంబర్​ 8న రూ.500, రూ.1000 విలువైన పెద్ద నోట్లను రద్దు చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేశారు.

ఇదీ చూడండి: 'నోట్ల రద్దుతో మోదీ మిత్రులకే మేలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.