కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. లాక్డౌన్ ఎత్తివేత ప్రక్రియను ముమ్మరం చేసింది దిల్లీ ప్రభుత్వం. తాజాగా మరిన్ని సడలింపును ప్రకటించింది. సోమవారం నుంచి రెస్టారెంట్లను 50శాతం సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతించింది. ఈ మేరకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు.
సడలింపులు ఇలా..
- మార్కెట్లు, మాల్స్ నిర్వహణకు ఉ.10 నుంచి రా.8 వరకు అనుమతి.
- జోన్‌లో ఒక మార్కెట్ తెరవచ్చు. అది కూడా వారాంతంలోనే.
- దిల్లీ మెట్రో, బస్సులు 50శాతం సామర్థ్యంతో నడుస్తాయి.
- ఆటోలు, ఈ-రిక్షాలు, ట్యాక్సీల్లో ఇద్దరికి మాత్రమే అనుమతి.
- స్పాలు, జిమ్ములు, యోగా కేంద్రాలు, పార్కులు, గార్డెన్లు తెరుచుకోవు.
- ప్రార్థనా మందిరాలు తెరిచినా భక్తులకు అనుమతి లేదు.
- ఇంటి వద్ద 20మందితో వివాహా వేడుకలు జరుపుకోవచ్చు, హోటళ్లు, బ్యాంకెట్ హాళ్లలో వివాహాలకు అనుమతి లేదు.
- అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి.
ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం గ్రూప్-ఏ సిబ్బందికి, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందికి అనుమతి ఇచ్చినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఈ సడలింపులను వారంపాటు గమనించి తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. కరోనా కేసులు పెరిగితే ఆంక్షలు మరింత కఠినం చేస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Third wave: 'కరోనా మూడో దశ అనివార్యం'
ఇదీ చూడండి: Unlock: 'క్రమంగా లాక్డౌన్ ఎత్తివేత'