ETV Bharat / bharat

దిల్లీ వర్సిటీ విద్యార్థులకు 'డిజిటల్​ డిగ్రీలు' - దిల్లీ యూనివర్సిటీ

దేశంలో మొట్టమొదటి సారిగా విద్యార్థులకు డిజిటల్​ రూపంలో డిగ్రీలను అందించింది దిల్లీ విశ్వవిద్యాలయం. వివిధ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించిన 1,78,719 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు మెయిల్​ ద్వారా డిజిటల్​ డిగ్రీలను శనివారం అందుకున్నారు.

Delhi University awards digital degrees to over lakh students
దిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులకు 'డిజిటల్​ డిగ్రీలు'
author img

By

Published : Feb 28, 2021, 4:34 PM IST

దిల్లీ విశ్వవిద్యాలయం 97వ స్నాతకోత్సవంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలిసారి 1,78,719 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు డిజిటల్ రూపంలో డిగ్రీలను అందజేసింది దిల్లీ వర్సిటీ. భవిష్యత్​లో పీహెచ్​డీ విద్యార్థులకు సైతం ఇలానే డిజిటల్​ విధానంలో డిగ్రీలు అందిస్తామని వర్సిటీ ప్రొఫెసర్ డీఎస్. రావత్ 'ఈటీవీ భారత్​' కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 156 మందికి పతకాలను, 36 మందికి బహుమతులను అందించారు. దాదాపు 600 పైగా పీహెచ్​డీ విద్యార్థులకు డిగ్రీలను అందజేశారు.

2020లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిజిటల్ డిగ్రీలను అందించామని ప్రొఫెసర్ రావత్ తెలిపారు. విద్యార్థుల డిగ్రీలను డిజిటల్ ఫార్మాట్​లోకి మార్చేందుకు నెల రోజుల సమయం పట్టిందని వివరించారు.

ఈమెయిల్​ ఐడీకి ఓ లింక్ పంపించామని.. రూ. 700 రుసుం చెల్లించి, ఓ ధ్రువపత్రాన్ని నింపాలన్నారు. ఆ తర్వాత డిజిటల్​ రూపంలో విద్యార్థులు డిగ్రీలను తీసుకోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి : 'విద్యావ్యవస్థలో మార్పులు వారి సూచనల మేరకు జరగాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.