ETV Bharat / bharat

పిల్లలకు కొవాగ్జిన్​ రెండో డోసుపై క్లినికల్ ట్రయల్స్!

2-6 ఏళ్ల లోపు పిల్లలకు కొవాగ్జిన్​ రెండో డోసు ఇవ్వటంపై ఎయిమ్స్ కీలక ప్రకటన చేసింది. కొవాగ్జిన్​ టీకాపై వచ్చేవారం నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. పిల్లల కోసం కొవిడ్​ టీకా అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని ఇటీవల ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్​ రణదీప్​ గులేరియా పేర్కొన్నారు.

AIIMS, Delhi
పిల్లలకు కొవాగ్జిన్​
author img

By

Published : Jul 23, 2021, 10:03 AM IST

హైదరాబాద్​కు చెందిన భారత్​ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ టీకా రెండో డోసు.. పిల్లలకు ఇవ్వటంపై ఎయిమ్స్​ సంస్థ స్పష్టత ఇచ్చింది. 2-6 ఏళ్ల లోపు పిల్లలకు కొవాగ్జిన్ టీకా రెండో డోసుపై వచ్చే వారం క్లినికల్​ ట్రయల్స్​ ప్రారంభించనున్నట్లు తెలిపింది.

పిల్లల కోసం కొవిడ్​ టీకా అందుబాటులోకి వస్తే అది కీలకమైన విజయమని ఇటీవల ఎయిమ్స్​ చీఫ్​ డాక్టర్​ రణదీప్​ గులేరియా పేర్కొన్నారు.

2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు వారి కోసం భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్​ టీకా.. రెండో, మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​​ సమాచారం సెప్టెంబర్​ నాటికి వస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పిల్లలకు టీకాపై ఎయిమ్స్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

'మూడో దశ ప్రభావం పిల్లలపై ఉండదు'

6-12 ఏళ్ల పిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.