ETV Bharat / bharat

పట్టపగలే కోర్టులో కాల్పులు.. ముగ్గురు మృతి - జితేంద్ర గోగీ

Shots fired at Rohini court premises
పట్టపగలే కోర్టులో కాల్పులు
author img

By

Published : Sep 24, 2021, 1:55 PM IST

Updated : Sep 24, 2021, 5:34 PM IST

13:52 September 24

పట్టపగలే కోర్టులో కాల్పుల కలకలం

పట్టపగలే కోర్టులో కాల్పుల కలకలం

దిల్లీ రోహిణీ కోర్టు ప్రాంగణంలో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఘటనలో ఓ గ్యాంగ్​స్టర్​ సహా.. మొత్తం ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. 

ఏం జరిగింది?

గ్యాంగ్​స్టర్​ జితేంద్ర అలియాస్​ గోగీని రోహిణీ కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్నారు దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు. ఈ క్రమంలోనే.. న్యాయవాదుల దుస్తుల్లో వచ్చిన దుండగులు గోగీపై కాల్పులు జరిపారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఆ ఇద్దరు దుండగులు హతమయ్యారు. ఇందులో ఒకరిపై రూ. 50 వేల రివార్డు ఉన్నట్లు తెలిపారు దిల్లీ పోలీసు కమిషనర్​ రాకేశ్​ అస్థానా. 

తీవ్ర గాయాలైన గోగీని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను కూడా మృతి చెందినట్లు డీసీపీ తెలిపారు.  

జితేంద్ర గోగీని వివిధ కేసుల కింద 2020లో దిల్లీ పోలీస్​ ప్రత్యేక విభాగం అరెస్ట్​ చేసింది. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి జైలులో ఉంచారు. శుక్రవారం పోలీసులు, 3వ బెటాలియన్​ దళాలు గోగీని రోహిణి కోర్టుకు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే కాల్పుల ఘటన జరిగింది. 

భయంభయంగా..

న్యాయమూర్తులు, న్యాయవాదులు, విచారణ కోసం వచ్చిన కక్షిదారులతో రోహిణీ కోర్టు కిక్కిరిసి ఉన్న సమయంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా జరిగిన కాల్పులు కలకలం రేపాయి. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ సంఘటనతో అంతా భయాందోళనకు గురయ్యారు. 

ఆస్పత్రిలో జడ్జి..

ఈ ఘటనతో ఎన్​డీపీఎస్​ కోర్టు జడ్జి.. ఏఎస్​జే గగన్​దీప్​ సింగ్​ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. హైబీపీతో బాధపడుతున్న ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

కాల్పులు జరిపిన వెంటనే దిల్లీ రోహిణీ కోర్టులో భద్రతను పటిష్ఠం చేశారు. కోర్టులో అదనపు బలగాలను మోహరించారు. కాల్పుల ఘటనపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చూడండి: జవాన్ల మధ్య భీకర కాల్పులు- ఇద్దరు మృతి

మోడల్‌కు తప్పుడు హెయిర్​కట్-​ రూ.2 కోట్ల పరిహారం!

Last Updated : Sep 24, 2021, 5:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.