SpiceJet plane diverted: దిల్లీ- శిర్డీ మధ్య ప్రయాణించే స్పైస్‌జెట్ విమానాన్ని ముంబయికి మళ్లించారు. వాతావరణం అనుకూలించని కారణంగా.. విమానాన్ని ముంబయి విమానాశ్రయంలో దింపినట్లు స్పైస్‌జెట్ వెల్లడించింది. ఈ క్రమంలో, ప్రయాణం ఐదు గంటలు ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.
ఎస్జీ 953 అనే విమానం.. దిల్లీ నుంచి గురువారం మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరింది. శిర్డీకి సాయంత్రం 4.50 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించక ముంబయిలో విమానాన్ని దింపేశారు. విమానంలోని ప్రయాణికులు శిర్డీ వెళ్లేందుకు రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు స్పైస్‌జెట్ వెల్లడించింది. ప్రయాణికుల సంరక్షణే తమ తొలి బాధ్యత అని పేర్కొంది.
కాగా, ఈ ఘటనపై పలువురు ప్రయాణికులు.. విమాన సిబ్బందిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. ఈ మేరకు కొందరు ప్రయాణికులు సోషల్‌మీడియాలో వీడియోలు అప్లోడ్ చేశారు.
ఇదీ చదవండి: