Delhi Sex racket: దిల్లీలో సెక్స్ రాకెట్ ముఠా బయటపడింది. మసాజ్ పార్లర్ ముసుగులో వ్యభిచారాన్ని నిర్వహిస్తోన్న యజమానితో సహా ఏడుగురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దిల్లీ సెంట్రల్ జిల్లాలో ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం రావడం వల్ల పార్లర్‌పై దాడులు జరిపి నిందితులను పట్టుకున్నామని తెలిపారు.
తూర్పు పటేల్ నగర్‌లోని 'ది స్పేస్ స్పా' పేరుతో మసాజ్ పార్లర్‌ను నిర్వహిస్తున్నారు నిందితులు. ఈ పార్లర్లో వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు చాలా ఫిర్యాదులు అందాయి. అలా బుధవారం పార్లర్‌పై దాడులు నిర్వహించి నిందితులని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో మసాజ్ సెంటర్ యజమాని, ఆమె భర్త ఈ వ్యభిచారాన్ని నడిపిస్తున్నారని తేలింది. వారు పార్లర్లో అమ్మాయిలను నియమించుకుని ఈ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: పాపం.. ఐస్‌క్రీం బాక్స్‌లో చిక్కుకొని పిల్లలు మృతి