ETV Bharat / bharat

పూలు జల్లుతూ విద్యార్థులకు టీచర్ల స్వాగతం - దిల్లీ లో పాఠశాలల ప్రారంభం

కరోనా నిబంధనల నడుమ దేశ రాజధానిలో సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దాదాపు పది నెలల తర్వాత స్కూళ్లు తెరుచుకున్న నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొంది. బెలూన్​లు, పూలు, పోస్టర్లు విద్యార్థులకు ఆహ్వానం పలికాయి. 10, 12 తరగతులకు ఆఫ్​లైన్​ క్లాసులు నిర్వహించడానికి దిల్లీ ప్రభుత్వం అనుమతినిచ్చింది.

delhi schools reopen
దిల్లీలో ప్రారంభమైన పాఠశాలలు
author img

By

Published : Jan 18, 2021, 1:05 PM IST

Updated : Jan 18, 2021, 1:13 PM IST

దాదాపు 10 నెలల తర్వాత దేశ రాజధానిలో 10, 12 తరగతులకు సోమవారం పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. శానిటైజర్​లు, బెలూన్​లు, పూలు, ఉపాధ్యాయుల చిరునవ్వులు విద్యార్థులకు స్వాగతం పలికాయి. పాఠశాలల ప్రాంగణాల్లో వెల్​కమ్​ బ్యాక్​ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఈ విద్యాసంవత్సరంలో మొదటిసారి ఆఫ్​లైన్​ తరగతలకు హాజరవుతున్న విద్యార్థులు మాస్క్​లు ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ పాఠశాలల ముందు నిలబడ్డారు.

ప్రతి విద్యార్థి శరీర ఉష్ణోగ్రతను టీచర్లు పరిశీలించి, స్వాగతం పలికారు. విడతల వారీగా విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారు. పదినెలల తర్వాత స్కూళ్లకు హాజరవడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

delhi schools reopen
పాఠశాల ప్రాంగణంలో వెలిసిన పోస్టర్లు
delhi schools reopen
భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న టీచర్లు

విద్యార్థులు తరగతులకు హాజరవుతున్న నేపథ్యంలో స్కూళ్ల సంసిద్ధతను దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పరిశీలించారు. కంటైన్​మెంట్​ జోన్​లలో లేని ప్రదేశాల్లో 10, 12 తరగతులకు పాఠశాలలు తెరుచుకోవడానికి జనవరి 18 నుంచి దిల్లీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

delhi schools reopen
భౌతిక దూరం పాటిస్తూ తరగతి గది నిర్వహణ

ఇదీ చదవండి:దేశంలో కొత్తగా 13,788 మందికి కరోనా

Last Updated : Jan 18, 2021, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.