ETV Bharat / bharat

'దిల్లీ అల్లర్ల వెనక పక్కా ప్రణాళిక'

author img

By

Published : Sep 28, 2021, 12:24 PM IST

Updated : Sep 28, 2021, 1:06 PM IST

2020లో దేశ రాజధానిలో జరిగిన అల్లర్లపై దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నాటి అల్లర్లు అనూహ్యంగా జరగలేదని.. పక్కా ప్రణాళికతోనే అల్లర్లు చెలరేగినట్టు తమకు అనుమానంగా ఉందని జస్టిస్​ ప్రసాద్​ అభిప్రాయపడ్డారు. ఓ నిందితుడి బెయిల్​ పిటిషన్​పై జరిగిన విచారణలో భాగంగా జస్టిస్​ ప్రసాద్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

Northeast Delhi riots
Delhi riots

గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ అల్లర్లు అనూహ్యంగా జరిగినవి కావని.. పక్కా ప్రణాళికతో, అన్నింటినీ పరిగణలోకి తీసుకునే జరిగినట్టు అనుమానిస్తున్నామని దిల్లీ హైకోర్టు వెల్లడించింది. అల్లర్లకు సంబంధించిన దృశ్యాలను చూస్తుంటే ఇదే నిజమనిపిస్తున్నట్టు.. ఓ బెయిల్​ పిటిషన్​ విచారణలో భాగంగా జస్టిస్​ సుబ్రమణియం ప్రసాద్​ వ్యాఖ్యనించారు.

సీఏఏ వ్యతిరేక నిరసనల్లో హెడ్​ కానిస్టేబుల్​ రతన్​ లాల్​.. తీవ్ర గాయాలతో మరణించారు. ఈ ఘటనకు సంబంధించి మహమ్మద్​ ఇబ్రహీం అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తాజాగా అతడి బెయిల్​ పిటిషన్​ న్యాయస్థానం ముందుకు వచ్చింది. విచారణ చేపట్టిన జస్టిస్​ ప్రసాద్​.. బెయిల్​ పిటిషన్​ను తిరస్కరించారు.

"కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు సరిగ్గా పనిచేయలేదు. మరికొన్ని చోట్ల అవి ధ్వంసమయ్యాయి. అనేకమంది నిరసనకారులు కర్రలు, రాడ్లు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చారు. ఈ పరిణామాలను చూస్తుంటే.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ముందే ప్రణాళికలు రచించినట్టు కనిపిస్తోంది. ఇబ్రహీం చేతిలో పదునైన కత్తి ఉంది. ఇబ్రహీంకు లాల్​ మృతికి సంబంధం లేదని మీరు(నిందితుడి తరపు కౌన్సిల్​) అంటున్నారు. తనని, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు కత్తిపట్టుకున్నాడని చెబుతున్నారు. కానీ నిందితుడి చేతిలో ఉన్న ఆయుధంతో ఇతరులకు హాని కలిగించవచ్చన్నది స్పష్టం. ఘటనాస్థలంలో నిందితుడు లేకపోయినా.. నిరసనల్లో అతడూ పాల్గొన్నాడని కోర్టు విశ్వసిస్తోంది. అందుకే తన ఇంటిని విడిచి 1.6కిలోమీటర్లు కత్తి పట్టుకుని ప్రయాణించాడు."

--- జస్టిస్​ ప్రసాద్​, దిల్లీ హైకోర్టు

ఈ పూర్తి కేసుకు సంబంధించి కోర్టు ఎమినిది మందికి హెయిల్​ మంజూరు చేసింది. ముగ్గిరికి నిరాకరించింది.​

ఇవీ చూడండి:

'దిల్లీ అల్లర్లు ఉగ్ర చర్యలతో సమానం'

దిల్లీ ఘర్షణల కేసులో ఉమర్ ఖలీద్ అరెస్టు

దిల్లీ అల్లర్లపై 700 ఎఫ్​ఐఆర్​లు- 2,400 మంది అరెస్టు

Last Updated : Sep 28, 2021, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.