కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. గణతంత్ర దినోత్సవం రోజున రైతన్నలు చేపట్టిన పరేడ్‌తో దిల్లీ దద్దరిల్లింది. తీవ్ర హింసాత్మకంగా మారిన ఈ ఘటనలో.. భారీ ర్యాలీ చేపట్టిన నిరసనకారుల బృందం ఎర్రకోట ఎక్కి రైతన్నల జెండాను ఎగురవేశారు.
ఈ ట్రాక్టర్ ర్యాలీలో ఎర్రకోట ప్రాంతం చెల్లాచెదురైంది. అక్కడి వాహనాలు ధ్వంసమవడం సహా.. మరికొన్ని వాహనాలు బోల్తా పడ్డాయి. అక్కడి టికెట్ కౌంటర్‌పై దాడిచేయడం వల్ల.. అందులోని దస్త్రాలు, ఇతర కాగితాలు చిందరవందరగా పడిఉన్నాయి. సమీపంలోని మెడికల్ డిటెక్టర్ గేట్ వద్ద గాజు ముక్కలు, పోలీసుల టోపీలు కనిపిస్తున్నాయి.
-
#WATCH: Broken shards of glass, scattered pieces of paper and vandalised ticket counter seen at the Red Fort in Delhi.
— ANI (@ANI) January 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
A group of protestors climbed to the ramparts of the fort and unfurled flags on January 26. pic.twitter.com/myCOU9QrJK
">#WATCH: Broken shards of glass, scattered pieces of paper and vandalised ticket counter seen at the Red Fort in Delhi.
— ANI (@ANI) January 27, 2021
A group of protestors climbed to the ramparts of the fort and unfurled flags on January 26. pic.twitter.com/myCOU9QrJK#WATCH: Broken shards of glass, scattered pieces of paper and vandalised ticket counter seen at the Red Fort in Delhi.
— ANI (@ANI) January 27, 2021
A group of protestors climbed to the ramparts of the fort and unfurled flags on January 26. pic.twitter.com/myCOU9QrJK
ఘటన అనంతరం.. సంఘటనా స్థలాన్ని సందర్శించారు కేంద్రపర్యటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్. ఈ దాడుల్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. జరిగిన నష్టంపై నివేదిక కోరారు. అధికారులను వివరణ అడిగారు.
ఇదీ చదవండి: ఎర్రకోట ఘటనపై రంగంలోకి ఎన్ఐఏ!