ETV Bharat / bharat

ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం.. 14 ఏళ్ల బాలికపై రేప్​.. ఫ్రెండ్స్​తో కూడా చేయాలంటూ..

ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమైన స్నేహితుడు.. 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. అక్కడితో ఆగకుండా తన స్నేహితులతో కూడా శారీరక సంబంధాలు పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ ఘటన దిల్లీలో జరిగింది. మరో ఘటనలో.. ఆరేళ్ల బాలికను బాత్రూంలో బంధీగా ఉంచింది ఓ ఉపాధ్యాయురాలు. ఈ హృదయ విదారక ఘటన ఛత్తీస్​గఢ్​లో వెలుగు చూసింది.

instagram friend raped minor girl in delhi

author img

By

Published : Apr 23, 2023, 6:11 PM IST

దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమైన ఓ స్నేహితుడు.. 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు చూపిస్తూ బాధితురాలిని బ్లాక్​మెయిల్​ చేశాడు. దీంతో అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు నగరంలోని ఓ ప్రాంతంలో తన కుటుంబంతో కలసి నివాసం ఉంటోంది. ఆమెకు సెప్టెంబర్​ 2022లో ఓ యువకుడితో ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాటింగ్​ మొదలుపెట్టి.. ఫోన్​ నంబర్లు మార్చుకున్నారు. ప్రైవేట్​గా చాటింగ్​ చేసుకున్నారు. అయితే, కొద్ది రోజుల తర్వాత.. చాటింగ్​ అంతా బాలిక తల్లిదండ్రులకు చూపిస్తానని ఆమెను బెదిరించాడు నిందితుడు. అనంతరం ఆమెను ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో తీసిన అభ్యంతరకర వీడియో, ఫొటోలు చూపిస్తూ బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేశాడు. తన స్నేహితులతో కూడా శారీరక సంబంధాలు పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో విసిగిపోయిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు.. త్వరలో నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఆరేళ్ల బాలికను బాత్రూంలో బంధించిన టీచర్​..
ఛత్తీస్​గఢ్​లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఉపాధ్యాయురాలు.. ఆరేళ్ల బాలికను బాత్రూం గదిలో బంధీగా ఉంచి.. రోజూ దాడికి పాల్పడింది. బాలికను కొడుతున్న శబ్దాలు రోజూ వినపడుతుండటం వల్ల.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉపాధ్యాయురాలి ఇంటిపై దాడి చేసి బాలికను కాపాడారు. ఈ మహిళ ఉపాధ్యాయురాలి నిర్వాకం రాయ్​గఢ్​​ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశా అగర్వాల్ అనే ఉపాధ్యాయురాలు ఖర్సియా డెవలప్‌మెంట్ బ్లాక్‌ ప్రాంతంలోని బన్స్‌ముడా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తోంది. ఆమె డ్రైవర్ పేదరికం కారణంగా తన కుమార్తెను చదివించలేక పోయాడు. దీంతో అగర్వాల్ కుటుంబానికి చిన్నారిని దత్తత ఇచ్చాడు. గత 2 సంవత్సరాలుగా బాలిక నిశా వద్ద ఉంది. చాలా రోజులుగా ఆ ఇంట్లో నుంచి శబ్దాలు వినిపించేవి. దీంతో ఓ రోజు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మహిళ ఇంటిపై దాడి చేసి బాలికను రక్షించారు. ఆ బాలికను సీడబ్ల్యూసీ (చైల్డ్​ వెల్ఫేర్​ కమిటీ)కి అప్పగించారు. అయితే, ఆ మహిళ గతంలో కూడా ఓ బాలికను బంధీగా ఉంచుకుని దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయని మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారి దీపక్ దంసేనా తెలిపారు. ఆ సమయంలో కూడా బాలికను కాపాడామని తెలిపారు. ఈ ఘటనలు మహిళ మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని.. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.