ETV Bharat / bharat

టూల్​కిట్​ వివరాల కోసం జూమ్​కు పోలీసుల లేఖ - టూల్​ కిట్​ సమావేశంపై దిల్లీ పోలీస్ లేఖ

రైతు నిరసనలకు సంబంధించి జనవరి 11న జరిగిన టూల్​ కిట్ సమావేశంలో పాల్గొన్నవారి వివరాల కోసం జూమ్​ సంస్థకు దిల్లీ పోలీసులు లేఖ రాశారు. ఈ సమావేశాన్ని ఖలిస్థానీ అనుకూల వర్గమైన పోయెటిక్​ జస్టిస్​ ఫౌండేషన్(పీజేఎఫ్)​ నిర్వహించిందని పోలీసులు భావిస్తున్నారు.

Delhi Police writes to Zoom, seeks details of those who attended toolkit meeting ahead of R-Day
టూల్​కిట్​ మీటింగ్​ వివరాల కోసం జూమ్​కు దిల్లీ పోలీస్ లేఖ
author img

By

Published : Feb 16, 2021, 1:23 PM IST

రైతు ఉద్యమానికి సంబంధించి జనవరి 11న జూమ్​ యాప్​ ద్వారా నిర్వహించిన 'టూల్ కిట్'​ సమావేశంలో పాల్గొన్న వారి వివరాల కోసం దిల్లీ పోలీసులు.. జూమ్​ సంస్థకు లేఖ రాశారు. ఈ సమావేశాన్ని ఖలిస్థానీ అనుకూల వర్గమైన పోయెటిక్​ జస్టిస్​ ఫౌండేషన్(పీజేఎఫ్)​ నిర్వహించిందనీ... ఇందు​లో పాల్గొన్న 70 మందిలో ముంబయికి చెందిన న్యాయవాది నిఖితా జాకబ్,​ పుణెకు చెందిన ఇంజినీర్​ శంతను ఉన్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.

"ఈ మెయిల్ ద్వారా టూల్​ కిట్ డాక్యుమెంట్​ను శంతను రూపొందించాడు. కెనడాకు చెందిన ఓ మహిళ ద్వారా ఖలిస్థానీ వ్యవస్థాపకుడు మో ధలివాల్.. నికితా జాకబ్, శంతనును సంప్రదించాడు. జనవరి 11న ఖలిస్థానీ గ్రూప్​ ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్​లో నికిత, శంతను పాల్గొని 'గ్లోబల్ ఫార్మర్​ స్ట్రైక్​' పేరుతో టూల్​కిట్​ను తయారు చేయాలని నిర్ణయించారు."

--​ ప్రేమ్​ నాథ్, దిల్లీ జాయింట్​ కమిషనర్, సైబర్​ క్రైం విభాగం

టూల్ కిట్ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల దిశ రవిని దిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం శనివారం అరెస్టు చేసింది. ఆమెకు కోర్టు 5 రోజుల కస్టడీ విధించింది. టూల్​కిట్​ వల్లే జనవరి 26న రైతుల ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారిందన్నది పోలీసుల వాదన.

ఇదీ చదవండి: 'టూల్​కిట్​' కేసులో ఇద్దరికి నాన్​ బెయిలబుల్​ వారెంట్​

థన్‌బర్గ్‌ టూల్‌కిట్‌ కేసులో పోలీసు కస్టడీకి దిశ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.