లాక్డౌన్లో 'బాబా కా దాబా' యజమాని కాంతా ప్రసాద్ దుస్థితిని వెలుగులోకి తెచ్చిన ప్రముఖ యూట్యూబర్ గౌరవ్ వాసన్‌పై త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉందని దిల్లీ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. కాంతా ప్రసాద్.. వాసన్‌కు క్షమాపణలు చెప్పినప్పటికీ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోలేదని తెలిపారు.
సామాజిక మాధ్యమాల్లో వీడియో అప్లోడ్ చేసిన అనంతరం.. వచ్చిన విరాళాలను తనకు ఇవ్వలేదని ఆరోపిస్తూ.. ఎనిమిది నెలల క్రితం గౌరవ్ వాసన్‌పై కాంతా ప్రసాద్ కేసు పెట్టారు.
సొంత ఖాతాల్లోకి..
వాసన్, అతని భార్య బ్యాంకు ఖాతాలను పరిశీలించిన పోలీసులు రూ.4 లక్షలకు పైగా విరాళం అందుకున్నట్లు కొనుగొన్నారు. అయితే ఆ డబ్బును కాంతా ప్రసాద్‌కి ఇవ్వలేదని తేల్చారు. ప్రసాద్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే తమ ఖాతాల్లోని డబ్బును బదిలీ చేసినట్లు గుర్తించారు.
ఆయన సొంతంగా ప్రారంభించిన రెస్టారెంట్‌ను.. గిరాకీ లేక ఇటీవలే మూసివేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన దిల్లీలోని సఫ్దార్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన వృద్ధ దంపతులను ఆదుకునేందుకు దిల్లీకి చెందిన గౌరవ్ వాసన్ అనే వ్యక్తి ఓ వీడియో రూపొందించగా.. సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌గా మారిపోయింది. దీంతో 'బాబా కా దాబా' హోటల్‌కు విశేష ప్రాచుర్యం లభించింది.
ఇవీ చదవండి: