ట్విట్టర్ ఇండియాకు చెందిన కార్యాలయాల్లో సోదాలు చేపట్టింది దిల్లీ పోలీసు స్పెషల్ సెల్. కొవిడ్ టూల్‌కిట్ విషయంపై దర్యాప్తులో భాగంగా దిల్లీ, గురుగ్రామ్‌లలోని కార్యాలయల్లో తనిఖీలు నిర్వహించింది. అనంతరం ఇందుకు సంబంధించి నోటీసులు అందించింది.
దిల్లీలోని లాడో సరాయ్, గురుగ్రామ్‌లోని ట్విట్టర్ ఇండియా ఆఫీసుల్లో రెండు బృందాలు సోదాలు చేపట్టినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కొవిడ్-19 టూల్‌కిట్‌పై వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తులో భాగంగా ట్విట్టర్‌కు స్పెషల్ సెల్ ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. భాజపా నేత సంబిత్ పాత్ర చేసిన ట్వీట్‌పై క్లారిటీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
పోలీసులకు తెలియని సమాచారం ట్విట్టర్ వద్ద ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ సమాచారం దర్యాప్తునకు సంబంధించినదిగా పేర్కొన్నారు దిల్లీ పోలీస్ పీఆర్ఓ చిన్మోయ్ బిస్వాల్.