ETV Bharat / bharat

పండగల వేళ ఉగ్రదాడులకు కుట్ర- పోలీసుల హైఅలర్ట్​! - terror attack delhi

పండగల వేళ దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో దిల్లీ పోలీస్ కమిషనర్(Delhi Police Commissioner) రాకేశ్ అస్థానా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఉగ్ర కుట్రలను నిరోధించే చర్యలపై చర్చించారు.

Delhi Police
Delhi Police
author img

By

Published : Oct 10, 2021, 10:20 AM IST

పండగల సమయంలో దేశ రాజధానిలో(Terrorist Attack in Delhi) ఉగ్రముఠాలు దాడులు నిర్వహించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో దిల్లీ పోలీసులు (Delhi Police) అప్రమత్తమయ్యారు. ఈ మేరకు నూతనంగా నియమితులైన డిప్యూటీ కమిషనర్​ ఆఫ్ పోలీస్ (డీసీపీ)లతో దిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్థానా(Rakesh Asthana) ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. స్థానికుల మద్దతుతో ఉగ్రవాదుల కదలికలను నిరోధించాలని సూచించారు.

పెట్రోల్ బంకులు, ఇంధన ట్యాంకర్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందనే సమాచారం అందినట్లు రాకేశ్ అస్థానా తెలిపారు. అలాగే స్థానికుల మద్దతుతోనే ఉగ్రదాడులు(Terror Attack Delhi) జరిగే అవకాశం ఉందని దిల్లీ పోలీసు చీఫ్ అభిప్రాయపడ్డారు.

"స్థానిక నేరస్థులు, గ్యాంగ్‌స్టర్‌లు ఉగ్రదాడులకు సహాయపడే అవకాశం ఉంది . సైబర్ కేఫ్​లు, కెమికల్ షాపులు, పార్కింగ్ స్థలాలు, స్క్రాప్ దుకాణాలు, కార్ డీలర్లపై నిఘా ఉంచాలి."

-రాకేశ్ అస్థానా, దిల్లీ పోలీసు కమిషనర్

అద్దెదారులు, కార్మికుల ధ్రువీకరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాలని రాకేశ్ అస్థానా పోలీసులను ఆదేశించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌పై దృష్టి సారించాలని సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.