ETV Bharat / bharat

ట్విట్టర్​కు మరో షాక్​- దిల్లీలో కేసు

author img

By

Published : Jun 30, 2021, 8:56 AM IST

సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్​ రోజురోజుకూ సమస్యల ఊబిలో చిక్కుకుంటోంది. తాజాగా అశ్లీల దృశ్యాలను(చైల్డ్​ పోర్నోగ్రఫీ) ట్విట్టర్​లో అనుమతించటంపై దిల్లీ పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. పోక్సో చట్టం ప్రకారం సంబంధిత సంస్థపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Twitter
ట్విట్టర్​

ట్విట్టర్​కు మరో షాక్​ తగిలింది. అశ్లీల దృశ్యాలను(చైల్డ్​ పోర్నగ్రఫీ) ట్విట్టర్​లో అనుమతించటంపై పోక్సో చట్టం ప్రకారం దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. డార్క్​ వెబ్​కు సంబంధించి ఓ టూల్​కిట్​ కూడా ట్విట్టర్​లో ఉన్నట్లు మే 29 తేదీనే జాతీయ బాలల హక్కుల కమిషన్​ దిల్లీ పోలీసులకు రాసిన లేఖలో పేర్కొంది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపింది.

అయితే తమ సంస్థ మొదటి నుంచి ఆన్​లైన్ పోర్నోగ్రఫీకి విరుద్ధం అని ట్విట్టర్​ అధికార ప్రతినిధి తెలిపారు. చైల్డ్ పోర్నోగ్రఫీని నిర్మూలించేందుకు తాము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. బాలల లైంగిక వేధింపులకు సంబంధించి ఏమైనా పోస్ట్​లు ఉంటే వాటిని తొలగిస్తామని పేర్కొన్నారు.

డార్క్​ వెబ్​కు సంబంధించి ఓ టూల్​కిట్​ కూడా ట్విట్టర్​లో ఉన్నట్లు మే 29న ఓ లేఖలో జాతీయ బాలల హక్కుల కమిషన్​ తెలిపింది.

ఇప్పటికే కేసులు..

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ను వేరే దేశంగా చూపిస్తూ ట్విట్టర్​ తన వెబ్​సైట్​లో తప్పుడు మ్యాప్​ ప్రదర్శించడంపై ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్​లో రెండు కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి : 'ఖాతాల నిలిపివేతపై ట్విట్టర్​ వివరణ ఇవ్వాలి'

ట్విట్టర్ వరుస వివాదాలు- పొరపాట్లా? కవ్వింపులా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.