తూర్పు దిల్లీ శకర్పుర్ ప్రాంతంలో ఐదుగురు ఉగ్రవాద అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారిని పట్టుకునే క్రమంలో కాల్పులకు పాల్పడగా ఎన్‌కౌంటర్‌కు దారితీసినట్లు చెప్పారు. వారికి ఖలీస్థాన్తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.
అరెస్ట్ అయిన వారిలో ముగ్గురు కశ్మీర్, ఇద్దరు పంజాబ్‌కు చెందిన వారుగా గుర్తించారు.
" ఎదురుకాల్పులు జరిగిన తర్వాత ఐదుగురిని అరెస్ట్ చేశాం. వారి నుంచి ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రి, డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నాం. వారిలో కొందరికి ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు తర్వాత నిజానిజాలు తెలుస్తాయి. "
- ప్రమోద్ సింగ్ కుశ్వాహ్, డిప్యూటీ కమిషన్ (ప్రత్యేక విభాగం)
ఇదీ చూడండి: పొరపాటున భారత్‌లోకి పీఓకే బాలికలు