ETV Bharat / bharat

10ఏళ్ల మైనర్​ పనిమనిషిపై చిత్రహింసలు.. పైలట్ దంపతులపై దాడి

Delhi Pilot Couple Thrashed : ఇంట్లో పనిచేసే 10 ఏళ్ల మైనర్​ను హింసించినందుకు పైలట్ దంపతులపై బాలిక బంధువులు దాడి చేశారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది. పైలట్ దంపతులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Delhi Pilot Couple Thrashed
Delhi Pilot Couple Thrashed
author img

By

Published : Jul 19, 2023, 5:58 PM IST

Updated : Jul 19, 2023, 7:14 PM IST

Delhi Pilot Couple Thrashed : ఇంట్లో పనిచేసే మైనర్‌ను హింసించిన ఓ మహిళా పైలట్‌, ఆమె భర్తపై బాధితురాలి బంధువులు దాడి చేశారు. దిల్లీలోని ద్వారక ప్రాంతంలో బుధవారం ఈ ఘటన జరిగింది.
ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో పనిచేసే దంపతులు.. 2నెలల కిందట పదేళ్ల బాలికను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. ఈ ఉదయం బాలికను చూసేందుకు వచ్చిన ఆమె బంధువు.. చిన్నారి శరీరంపై గాయాలను గుర్తించారు. చిన్నారిని హింసించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు మహిళా పైలట్‌ ఇంటికి వచ్చి గొడవకు దిగారు. దంపతులిద్దర్నీ వీధిలోకి లాగి దాడికి దిగారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మైనర్‌ను పనిలో పెట్టుకున్నందుకు కేసు నమోదు చేయడం సహా మహిళా పైలట్‌, ఆమె భర్తను అరెస్టు చేశారు. నిందితులను కౌశిక్ బాగ్చి (36), పూర్ణిమ బాగ్చి (33)గా గుర్తించారు.

ఇంటి పనులు సక్రమంగా చేయడం లేదని మైనర్​ను పైలట్ దంపతులు తరచుగా తిట్టేవారని బాధితురాలి బంధువు ఆరోపించారు. బాలికను పూర్ణిమ.. బుధవారం ఉదయం కొట్టడం తాను చూశానని చెప్పారు. బాధితురాలు బిహార్​లోని ముజఫర్​పుర్​కు చెందిన బాలిక అని పేర్కొన్నారు.

10ఏళ్ల మైనర్​ పనిమనిషిపై చిత్రహింసలు.. పైలట్ దంపతులపై దాడి

Delhi Pilot Domestic Help : బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని ద్వారకా డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు. 'పైలట్ దంపతులు పనిమనిషిగా నియమించుకున్న బాలిక వయసు 10 ఏళ్లు మాత్రమే. మేము ఘటనాస్థలి వెళ్లి.. బాలికకు వైద్య పరీక్షలు కోసం ఆస్పత్రికి తరలించాం. ఆమె శరీరంపై కొన్ని కాలిన గాయాలున్నాయి. పైలట్ దంపతులపై కేసు నమోదు చేశాం. వారిద్దరినీ అరెస్ట్ చేశాం. మైనర్​కు కౌన్సిలింగ్ ఇస్తున్నాం. నిందితులను కౌశిక్ బాగ్చి, అతడి భార్య పూర్ణిమ బాగ్చిగా గుర్తించాం. పూర్ణిమ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తుండగా.. ఆమె భర్త మరో ఎయిర్‌లైన్స్​లో పనిచేస్తున్నాడు.' అని డీసీపీ హర్షవర్ధన్ తెలిపారు.

10 ఏళ్ల మైనర్​పై దాడిని దిల్లీ మహిళా చీఫ్ స్వాతి మాలివాల్ స్పందించారు. 'మైనర్​ను ఇంటి పనిమనిషిగా పెట్టుకుని ఆమెను క్రూరంగా హింసించినవారిని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు సమాధానం ఇవ్వాలి.' అని స్వాతి మాలివాల్ కోరారు.

  • दिल्ली में एक महिला पायलट और उसके पति ने 10 साल की बच्ची को अपने घर नौकर रखा और उसे बेरहमी से टॉरचर किया गया। इस मामले में दिल्ली पुलिस से जवाब तलब किया है। ऐसे जल्लादों के ख़िलाफ़ सख़्त से सख़्त कार्यवाही होनी चाहिए। pic.twitter.com/VW3eSXtOTo

    — Swati Maliwal (@SwatiJaiHind) July 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Indigo Pilot Thrashed : మైనర్ పనిమనిషిని ఇద్దరు పైలట్ దంపతులు క్రూరంగా హింసించారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై విమానయాన సంస్థ ఇండిగో స్పందించింది. 10 ఏళ్ల మైనర్​పై దాడి చేసినందుకు ఒక పురుష ఉద్యోగిని తొలగించామని.. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు.

Last Updated : Jul 19, 2023, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.