కొవిడ్ (Covid-19) రెండో దశ వ్యాప్తిని కట్టడి చేయటంలో పైచేయి సాధించినట్లు తెలిపారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal). కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వైరస్ నియంత్రణకు అమలులో ఉన్న లాక్డౌన్(lockdown)ను క్రమంగా ఎత్తవేసే ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే.. వైరస్‌పై పోరు ముగియలేదని స్పష్టం చేశారు.
"లాక్‌డౌన్‌ను క్రమంగా ఎత్తివేయాలని దిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీతో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించాం. ఈ ప్రక్రియలో కిందిస్థాయిలోని రోజువారీ కూలీలు, కార్మికులు, వలస కార్మికుల వంటి వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నాం. పరిశ్రమలను తెరవాలని, నిర్మాణ పనులకు అనుమతించాలని నిర్ణయించాం. నిపుణులు, ప్రజల అభిప్రాయాలతో ప్రతి వారం అన్‌లాక్ ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుంది."
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
చాలా సమస్యలు ఎదుర్కొన్న తర్వాత కరోనా రెండో దశ ఉద్ధృతిని కట్టడి చేయగలిగామన్నారు కేజ్రీవాల్. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. గురువారం పాజిటివిటీ రేటు 1.5 శాతం లోపే ఉందని తెలిపారు.
ఇదీ చూడండి: 2 DG drug: 2-డీజీ డ్రగ్ ధర ఎంతంటే!