Delhi Liquor Scam Case AAP MP Arrest : ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్. దిల్లీ మద్యం కేసు మనీలాండరింగ్ వ్యవహారంలో ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం నుంచి ఎంపీ నివాసంలో సోదాలు చేసిన ఈడీ అధికారులు.. సాయంత్రం ఆయనను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
Delhi Excise Policy Case : అంతకుముందు దిల్లీ మద్యం కేసులో అప్రూవర్‌గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోడాతో సంజయ్‌కు పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు ఈడీ అధికారులు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం దిల్లీలోని ఎంపీ నివాసంలో కొన్ని గంటల పాటు సోదాలు జరిపారు. ఆ తర్వాత సంజయ్ సింగ్‌ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన్ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
-
#WATCH | Delhi | AAP MP Sanjay Singh was taken away from his residence by ED officials this evening after he was arrested following the ED raid in connection with the Delhi excise policy case. pic.twitter.com/swmAePusW1
— ANI (@ANI) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Delhi | AAP MP Sanjay Singh was taken away from his residence by ED officials this evening after he was arrested following the ED raid in connection with the Delhi excise policy case. pic.twitter.com/swmAePusW1
— ANI (@ANI) October 4, 2023#WATCH | Delhi | AAP MP Sanjay Singh was taken away from his residence by ED officials this evening after he was arrested following the ED raid in connection with the Delhi excise policy case. pic.twitter.com/swmAePusW1
— ANI (@ANI) October 4, 2023
-
#WATCH | Delhi | Supporters of AAP MP Sanjay Singh sit outside his residence and raise slogans.
— ANI (@ANI) October 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
ED raid is going on at his residence since today morning in connection with the Delhi excise policy case. pic.twitter.com/gGTvE3y2uk
">#WATCH | Delhi | Supporters of AAP MP Sanjay Singh sit outside his residence and raise slogans.
— ANI (@ANI) October 4, 2023
ED raid is going on at his residence since today morning in connection with the Delhi excise policy case. pic.twitter.com/gGTvE3y2uk#WATCH | Delhi | Supporters of AAP MP Sanjay Singh sit outside his residence and raise slogans.
— ANI (@ANI) October 4, 2023
ED raid is going on at his residence since today morning in connection with the Delhi excise policy case. pic.twitter.com/gGTvE3y2uk
సంజయ్ అరెస్ట్‌పై ఆప్ ఫైర్
AAP Sanjay Singh News : మరోవైపు ఎంపీ సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేయడంపై తీవ్రంగా ఖండించింది ఆప్. ఇండియా కూటమి చేతిలో ఓడిపోతామన్న భయంతోనే బీజేపీ ఇలా అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించింది. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రశ్నించినందుకే సింగ్‌ను.. లక్ష్యంగా చేసుకున్నారని కేంద్రంపై విరుచుకుపడింది. ప్రజల పక్షాన పోరాడుతున్నందుకే సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేయించారన్నారు ఆప్ సీనియర్ నేత అతిషి. ఆప్ కార్యాలయంలో ఈడీ ఆఫీస్‌ను ప్రారంభించండంటూ ఎద్దేవా చేశారు. కేవలం ఆప్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. బీజేపీ మనుగడ సాధిస్తోందన్నారు. ప్రధానమంత్రి మోదీ అభద్రత భావానికి ఎంపీ సంజయ్ సింంగ్ అరెస్ట్ నిదర్శనమన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఎన్నికలకు ముందు ఇంకా అనేక మంది ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ అవుతారంటూ జోస్యం చెప్పారు.
'ఆప్ సైనికులం.. వెనకుడుగు వేయం'
సరైన సాక్ష్యాలు చూపించకుండా ఈడీ దౌర్జన్యంగా తనను అరెస్ట్ చేస్తోందంటూ ఆరోపించారు సంజయ్ సింగ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ అరెస్ట్‌కు ముందు వీడియోలో మాట్లాడారు. తామంతా ఆప్ సైనికులమని.. వెనుకడుగు వేయబోమని చెప్పారు. ఎన్ని వేధింపులు ఎదరైనా సరే.. అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పుతానంటూ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి అభద్రతకు.. తన అరెస్ట్ నిదర్శనమని తెలిపారు.
ఆప్‌లో మూడో కీలక నేత అరెస్ట్
ఇప్పటివరకు దిల్లీ మద్యం కేసులో ఆప్ నుంచి అరెస్టయిన కీలక నేతల్లో సంజయ్ సింగ్ మూడో నేత. గతంలో నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన సత్యేందర్ జైన్‌ను ఈడీ అరెస్టు చేయగా.. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో కేజ్రీవాల్ సన్నిహితుడు, అప్పటి దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాను మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసింది.
Newsclick Founder Arrested : పోలీసు కస్టడీకి న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు.. సంస్థ HR సైతం..
ED Raids AAP MP : లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు