కొవిడ్ 19 టీకాల కొరత నివారణకు ఇప్పటికే పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తుండగా.. ఆ జాబితాలో దిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా చేరాయి. దేశీయంగా టీకాల సరఫరా తగినంత లేకపోవడం వల్ల రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లక తప్పడం లేదు. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటిదాకా 18 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు ఉచితంగా సరఫరా చేసినట్టు కేంద్రం చెబుతుండగా.. ఆయా రాష్ట్రాలు, యూటీల నుంచి డిమాండు రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా ఇప్పటికే గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి. యూపీ అధికారులు అంతర్జాతీయ స్పుత్నిక్ 'వి', మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సజ్ వ్యాక్సిన్లు భారీగా, నేరుగా సేకరించినట్లు మంగళవారం వెల్లడించారు. 18-44 వయసు వారి కోసమని తమకు అందుబాటులో ఉన్న మూడు లక్షల కొవాగ్జిన్ డోసులను 45 ఏళ్ల పైబడ్డ వారికి రెండో డోసు ఇచ్చేందుకు మళ్లిస్తామని మహారాష్ట్ర ప్రకటించారు.
ఇదీ చదవండి : పిల్లలపై కొవాగ్జిన్ 2, 3 దశల క్లీనికల్ ట్రయల్స్!