ETV Bharat / bharat

300 వీధి కుక్కల్ని పోషిస్తున్న పేద వృద్ధురాలికి మహా కష్టం.. రంగంలోకి హైకోర్టు

80 ఏళ్ల వయస్సులో 300 వీధి కుక్కలకు ఆశ్రయమిచ్చి అండగా ఉంటున్న ఓ వృద్ధురాలికి పెద్ద కష్టం వచ్చింది! ఆమె గుడిసెను దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. దీనిపై స్పందించిన దిల్లీ హైకోర్టు.. స్టే ఆర్డర్ జారీ చేసింది. విచారణ పూర్తి అయ్యేంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోరాదని మున్సిపల్ కార్పొరేషన్​ను ఆదేశించింది.

delhi-hc-gives-stay-order-after-dogs-their-octogenarian-caretaker-go-homeless-by-mcd-action
వృద్ధురాలి గుడిసె ద్వసంపై దిల్లీ హైకోర్టు స్టే
author img

By

Published : Jan 5, 2023, 2:03 PM IST

దాదాపు 300 వీధికుక్కలను సంరక్షిస్తున్న ఓ వృద్ధురాలి గుడిసెను దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. ఆమె కుక్కల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆశ్రయాన్ని సైతం ధ్వంసం చేశారు. దీనిపై స్పందించిన దిల్లీ హైకోర్టు.. బుధవారం స్టే ఆర్డర్ జారీ చేసింది. ఈ విషయంలో విచారణ పూర్తి అయ్యేంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోరాదని దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్​ను ఆదేశించింది.

delhi-hc-gives-stay-order-after-dogs-their-octogenarian-caretaker-go-homeless-by-mcd-action
300 వీధి కుక్కల్ని పోషిస్తున్న పేద వృద్ధురాలు

వివరాల్లోకి వెళ్తే.. ప్రతిమా దేవి అనే 80 ఏళ్ల వృద్ధురాలికి కుక్కలంటే చాలా ఇష్టం. గత 38 ఏళ్లుగా సాకేత్ ప్రాంతంలోని ఓ శిథిలావస్థలో ఉన్న గుడిసెలో ఉంటూ వీధికుక్కలను సంరక్షిస్తోంది. ప్రజలు వదిలి వెళ్లిన కుక్కలకు ఆశ్రయం ఇచ్చి ఆహారం పెడుతోంది. అయితే దిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్ సిబ్బంది.. ప్రతిమా దేవి చెందిన గుడిసెను, కుక్కల ఆశ్రయాన్ని ధ్వంసం చేశారు. అయితే ఈ విషయం దిల్లీ హైకోర్టు దాకా వెళ్లింది. దీంతో కోర్టు వృద్ధురాలికి తోడుగా నిలిచింది.

వృద్ధురాలి వద్ద ఆశ్రయం పొందుతున్న వీధి కుక్కలు

"నేను 1984లో దిల్లీకి వచ్చాను. అప్పటి నుంచి కుక్కలకు తోడుగా ఉంటున్నాను. మున్సిపల్​ సిబ్బంది నేను ఉంటున్న గుడిసెను కూల్చేశారు. నా వస్తువులను దూరంగా విసిరేశారు. కుక్కలను కొట్టారు. ప్రస్తుతం నేను, నా కుక్కలు ఓ చెట్టుకింద ఉన్నాము. ఉదయం నుంచి కుక్కలు ఏమి తినలేదు. పని చేసేందుకు నాకు శక్తి సరిపోదు. నేను జీవించి ఉన్నంత వరకు కుక్కలను సంరక్షిస్తాను." అని ప్రతిమా దేవి తెలిపారు. విషయం తెలుసుకున్న కొంతమంది స్థానికులు.. కుక్కలకు ఆహారాన్ని తీసుకువచ్చారు. వృద్ధురాలికి బట్టలు ఇచ్చారు. ఆమెకు అన్ని విధాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.