ETV Bharat / bharat

రూ.10వేలు లోన్​ కోసం పిటిషన్- రూ.25వేేలు ఫైన్​ వేసిన హైకోర్టు

author img

By

Published : Sep 29, 2021, 5:24 AM IST

Updated : Sep 29, 2021, 9:06 AM IST

'ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకం' ద్వారా కొందరు వ్యక్తులకు రూ. 10 వేలు లోన్ ఇప్పించాలంటూ దిల్లీ హైకోర్టులో(Delhi High Court News) పిటిషన్ దాఖలు చేశారు ఓ న్యాయవాది. దీనిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. పిటిషన్​ను తోసిపుచ్చింది. ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించమని ఆదేశిస్తూ రూ. 25వేలు జరిమానా విధించింది.

Delhi HC
దిల్లీ హైకోర్టు

వీధివ్యాపారుల సమగ్ర అభివృద్ధి కోసం అమలు చేసిన 'ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకం' కింద రూ. 10 వేలు లోన్​ ఇప్పించాలంటూ దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది దిల్లీ హైకోర్టు(Delhi High Court News). ఛీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు విచారణ చేపట్టింది. సరైన ఆధారాలు చూపి దరఖాస్తు చేయనివారికి ఆర్థిక సాయం ఎలా అందుతుందని ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లను ప్రోత్సహించమని తెలిపింది.

"ముందుగా లోన్ పొందడం కోసం సదరు వ్యక్తి దరఖాస్తు చేసుకోవాలి. సరైన ఆధారాలు చూపించుకోవాలి. కచ్చితంగా లోన్​ వస్తుందని ఎక్కడా లేదు. వారికి ఆర్థిక సాయం అందించాలని చెప్పడానికి పిటిషనర్ అర్హుడు కాదు." అని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్​ను కొట్టేసి.. రూ. 25వేలు జరిమానా విధించింది.

కొందరు వ్యక్తులకు రూ. 10 వేలు లోన్​ ఇప్పించాలంటూ ఓ న్యాయవాది తొలుత దిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఇదీ చదవండి:PM CARES Fund: 'పీఎం కేర్స్​ ఫండ్​ ప్రభుత్వ నిధి కాదు'

Last Updated : Sep 29, 2021, 9:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.