హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లలోని బార్లను తెల్లవారుజమున 3 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతించింది దిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు 2021-22 సంవత్సరానికి నూతన ఎక్సైజ్ విధానాన్ని సోమవారం ప్రకటించింది.
అనుమతి ఉన్న ప్రాంగణంలో ఏ ప్రాంతంలోనైనా దేశీ, విదేశీ లిక్కర్‌ను విక్రయించేందుకు అనుమతించింది దిల్లీ సర్కారు. ఈ కొత్త విధానంలో మైక్రోబ్రూవరీల నుంచి నేరుగా అప్పుడే తయారు చేసిన బీరు(డ్రాట్ బీరు)ను వినియోగదారులు బాటిళ్లలో కొనుక్కెళ్లేందుకు వీలు కల్పించింది. డ్రాట్ బీరును బార్లు, రెస్టారెంట్లకు సరఫరా చేసేందుకూ మైక్రోబ్రూవరీలకు అనుమతించింది.
ఇదీ చూడండి: మద్యం హోం డెలివరీకి ప్రభుత్వం అనుమతి