ETV Bharat / bharat

మీడియా ప్రతినిధులకు సామూహికంగా టీకా! - మీడియా ప్రతినిధులకు ఉచిత టీకా

మీడియా ప్రతినిధులకు ఉచిత వ్యాక్సినేషన్‌ అందించనున్నట్లు దిల్లీ ప్రభుత్వం తెలిపింది. మీడియా కార్యాలయాల్లోనే సిబ్బందికి టీకాలు అందిస్తామని పేర్కొంది. ఖర్చును తామే భరించనున్నట్లు తెలిపింది.

kejriwal
కేజ్రీవాల్
author img

By

Published : May 8, 2021, 5:07 AM IST

ప్రింట్‌, డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు త్వరలో టీకాలు అందిస్తామని దిల్లీ ప్రభుత్వం పేర్కొంది. మీడియా కార్యాలయాల్లోనే సిబ్బందికి వ్యాక్సిన్​లు ఇస్తామని తెలిపింది. టీకాల ఖర్చును కూడా తామే భరిస్తామని పేర్కొంది. మీడియా సిబ్బందిని కూడా కొవిడ్ వారియర్స్ కేటగిరీలో చేర్చి వారికి బీమా అందించాలని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా గురువారం సిఫార్సులు చేసింది.

ఇప్పటికే ఒడిశా, బిహార్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు.. జర్నలిస్టులను కొవిడ్​ వారియర్ల కేటగిరీలో చేర్చాయి. వారికి ఆర్థిక సహాయం అందించాయి. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం కూడా.. మీడియా సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రాధాన్యం కల్పించింది.

ఇదీ చదవండి: ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఓ మృగరాజుకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.