దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ బాణాసంచాపై నిషేధం విధిస్తూ దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధానిలో నానాటికి క్షీణిస్తున్న వాయు నాణ్యత నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.
ఓవైపు పండుగ సీజన్ వల్ల పెరుగుతున్న కొవిడ్ కేసులు, మరోవైపు వాయుకాలుష్యం నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా మెజిస్ట్రేట్లతో చర్చించిన అనంతరం కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాల మెరుగుదల సహా ఆక్సిజన్, ఐసీయూ పడకల సంఖ్య పెంచాలని నిర్ణయించారు.
కాళీ పూజలోనూ నిషేధం..
కరోనా విస్తరిస్తున్న వేళ కాళీమాత పూజలో బాణాసంచాపై నిషేధం విధించింది కోల్కతా హైకోర్టు. నవంబరు 15న కాళీ పూజ జరగనున్న నేపథ్యంలో బాణాసంచా కాల్చడం, అమ్మకాలను నిషేధించింది. జగద్ధాత్రి, ఛాత్, కార్తిక్ పూజల్లోనూ బాణాసంచాను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెండు ప్రజాప్రయోజనాల వ్యాజ్యాలను విచారించిన న్యాయస్థానం.. ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: 2021 ఎన్నికల బరిలో కమల్ హాసన్