ETV Bharat / bharat

రైతుల నిరసనకు దిల్లీ పోలీసుల అనుమతి

జంతర్​మంతర్​ వద్ద రైతులు చేపట్టనున్న నిరసనకు దిల్లీ పోలీసులు అనుమతిచ్చారు. అయితే కరోనా నిబంధనలు పాటించాలని.. రోజుకు 200 మందికి మించి పాల్గొనకూడదని పేర్కొన్నారు.

Farmers stage a protest
జంతర్​మంతర్​ వద్ద రైతుల నిరసన
author img

By

Published : Jul 21, 2021, 7:57 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా జంతర్​మంతర్​ వద్ద రైతులు చేపట్టనున్న శాంతియుత నిరసనకు దిల్లీ పోలీసులు అనుమతిచ్చారు. అయితే కరోనా నిబంధనలను పాటించాలని.. రోజుకు 200 మందికి మించకుండా ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే నిరసన చేపట్టాలని పేర్కొన్నారు.

ఈ నెల 22 నుంచి ఆగస్టు 9 వరకు అన్నదాతలు శాంతియుత నిరసనలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్​ కమిషనర్​ సతీశ్​ గోల్చా సహా.. సంయుక్త పోలీస్​ కమిషనర్​ జస్​పాల్​ సింగ్​లు.. జంతర్​మంతర్​ ప్రాంతాన్ని సందర్శించారు.

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జంతర్ మంతర్‌ వద్ద 'కిసాన్ పార్లమెంట్' నిర్వహిస్తామని రైతు సంఘాలు పేర్కొన్నాయి. జూలై 22 నుంచి ప్రతిరోజూ సింఘు సరిహద్దు నుంచి 200 మంది నిరసనకారులు హాజరవుతారని తెలిపాయి. దిల్లీ పోలీసు అధికారులతో మంగళవారం జరిగిన సమావేశం తరువాత, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద శాంతియుత ప్రదర్శనలు నిర్వహిస్తామని, నిరసనకారులు ఎవరూ వెళ్లరని స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి: అప్పటివరకు ఎర్రకోట బంద్​- కారణమిదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.