దిల్లీలో ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలో హోం ఐసొలేషన్‌లో ఉన్న కరోనా రోగులకు ఆన్లైన్ ద్వారా ఆక్సిజన్‌ను పంపిణీ చేస్తామని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అంబులెన్సులు, నర్సింగ్ హోమ్స్, కొవిడ్ ఇతర ఆస్పత్రులకు కూడా పంపిణీ చేస్తామని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం లబ్ధిదారులు దిల్లీ అధికారిక వెబ్సైట్లో ఫొటో ఐడీ, ఆధార్ కార్డు వివరాలు, కొవిడ్ పాజిటివ్ రిపోర్ట్ సహా సంబంధిత వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా బాధ్యత జిల్లా మెజిస్ట్రేట్లు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. సరిపడా సిబ్బందితో దరఖాస్తులను త్వరగా పరిశీలించి సిలిండర్లను అందించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపింది. డీలర్ల వద్ద ఉన్న స్టాక్ ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్.. తేదీ, సమయం, పంపిణీ కేంద్రం చిరునామా మొదలైన వివరాలతో దరఖాస్తుదారులకు ఈ-పాస్‌లను మంజూరు చేస్తారని ప్రకటనలో పేర్కొంది.
ఇదీ చదవండి : 'యూపీఏ పగ్గాలు మమతకు ఇవ్వాలి'