ETV Bharat / bharat

దిల్లీలో చమురు వర్షం!- రోడ్లపై జారిపడ్డ బైకర్లు - దిల్లీ చమురు వర్షం

చమురు వర్షం కురిసిందంటూ దిల్లీలో ఆదివారం పదుల సంఖ్యలో ఫోన్​కాల్స్ రావడం చర్చనీయాంశమైంది. రోడ్లు జారుడుగా మారడం వల్ల ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. కొంత మంది జారి పడిపోయారు. దీంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. దీనికి గల కారణాన్ని దిల్లీ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ వివరించారు.

delhi oil rain
దిల్లీలో చమురు వర్షం!- రోడ్లపై జారిపడ్డ బైకర్లు
author img

By

Published : Nov 16, 2020, 9:19 AM IST

దిల్లీలో ఆదివారం స్వల్ప వర్షం కురిసింది. ఈ సమయంలో దిల్లీ అగ్నిమాపక శాఖకు వచ్చిన ఫోన్​కాల్స్ చర్చనీయాంశంగా మారాయి. తమ ప్రాంతంలో చమురు వర్షం(ఆయిల్ రెయిన్) కురుస్తోందంటూ కాల్ చేసిన వ్యక్తులు ఫిర్యాదులు ఇచ్చారు. దిల్లీలోని వివిధ ప్రాంతాల నుంచి 57కు పైగా కాల్స్ వచ్చాయి. ఫోన్ చేసిన ప్రతీ ఒక్కరూ చెప్పింది ఈ చమురు వర్షం గురించే.

దీంతో అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయంపై దర్యాప్తు చేపడుతూనే పలు జాగ్రత్తలు తీసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ చమురు వర్షం వల్ల రోడ్లు జారుడుగా మారి ద్విచక్రవాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొందరు అదుపుతప్పి పడిపోయారు. దీంతో జామియా నగర్​కు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేశారు. ఈ విషయంపై ఫిర్యాదు మేరకు న్యూ ఫ్రెండ్స్ కాలనీలో అగ్నిమాపక సిబ్బంది పలు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

"చాలా మంది ద్విచక్రవాహనదారులు రోడ్డుపై జారి పడిపోయారు. రహదారిపై ఏదో ఆయిల్ లాంటి పదార్థం ఉంది. ముందుజాగ్రత్త చర్యగా అగ్నిమాపక సిబ్బందిని పిలిచాం. వారు రహదారిని శుభ్రపరిచారు."

-స్థానికుడు

దిల్లీ ఫైర్ సర్వీస్​కు 57 కాల్స్ వచ్చాయని ఆ శాఖ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. అన్నింటికీ స్పందించినట్లు చెప్పారు. వర్షం వల్ల భూమిపై ఉన్న దుమ్ము, రహదారులపై ఉన్న ఇతర జిగురు పదార్థాల ద్వారా రోడ్లు జారుడుగా మారాయని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.