ETV Bharat / bharat

భాజపాలో చేరితే కేసులు ఎత్తివేస్తాం, ఆప్​ను విడగొడితే సీఎంను చేస్తామన్నారు

author img

By

Published : Aug 22, 2022, 11:56 AM IST

Updated : Aug 22, 2022, 4:43 PM IST

భాజపాలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామంటూ తనను సంప్రదించారన్నారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియా. ఆమ్ ఆద్మీ పార్టీని విడగొడితే ముఖ్యమంత్రిని చేస్తామని ఆశజూపారని తెలిపారు. తనపై పెట్టిన కేసులన్నీ నిరాధారమైనవి ఆయన చెప్పారు.

Delhi excise policy
Delhi excise policy

Delhi excise policy : దిల్లీ ఎక్సైజ్​ విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా భాజపాలో చేరితే కేసులన్నీ ఎత్తివేస్తామంటూ తనను సంప్రదించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియా. ఆమ్ ఆద్మీ పార్టీని విభజిస్తే ముఖ్యమంత్రిని చేస్తామంటూ భాజపా ఆఫర్ ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే, వీటిని తాను ఖండించినట్లు చెప్పారు. "మహారాణా ప్రతాప్​, రాజ్​పుత్​ వారసుడిని. తల నరక్కుంటాను. కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను" అని సమాధానం ఇచ్చానని సిసోదియా చెప్పారు.

"భాజపా నుంచి నాకు ఓ సందేశం అందింది. ఆప్​ను విడిచిపెట్టి భాజపాలో చేరితే.. సీబీఐ, ఈడీ పెట్టిన కేసులన్నీ మూసేస్తామన్నారు. పార్టీని విడగొడితే సీఎంను చేస్తామన్నారు. దానికి స్పష్టమైన సమాధానం చెప్పా. కేజ్రీవాల్ నా రాజకీయ గురువు. ఆయన వద్దే రాజకీయ పాఠాలు నేర్చుకున్నా. సీఎం, పీఎం అయ్యేందుకు నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను మహారాణా ప్రతాప్​, రాజ్​పుత్​ వారసుడిని. తల నరక్కుంటాను. కానీ మీలాంటి కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తల వంచను. నాపైన పెట్టిన కేసులన్నీ అబద్ధం. మీరు చేయాలనుకున్నది చేసుకోండి అని చెప్పా."
-మనీశ్​ సిసోదియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి

మరోవైపు.. మద్యం వ్యవహారంలో సిసోదియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ నివాసం వద్ద ఆందోళన చేపట్టారు భాజపా కార్యకర్తలు. బారికేడ్ల పైకి ఎక్కి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శుక్రవారం మనీష్​ సిసోదియా నివాసం సహా దేశంలో ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు నిర్వహించింది. సిసోదియా అనుచరుడి కంపెనీకి మద్యం వ్యాపారి ఒకరు రూ.కోటి చెల్లించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఎఫ్​ఐఆర్‌లో పేర్కొన్న 15మందిలో ముగ్గురిని శనివారం సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

దిల్లీ ఎక్సైజ్‌ విధానంతో ముడిపడిన ఈ సోదాలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), భాజపా మధ్య మాటల యుద్ధం మొదలైంది. తమ ప్రభుత్వానికి ఆదరణ పెరగడాన్ని ఓర్వలేక కేంద్రం ఇలా భయపెట్టాలని చూస్తోందని ఆప్‌ విమర్శించింది. పంజాబ్‌లో ఆప్‌ విజయం తర్వాత కేంద్రంలోని భాజపా ప్రభుత్వ పెద్దల్లో భయం పట్టుకుందని, కేజ్రీవాల్‌ ఉన్నతిని నిలువరించాలన్న కుట్రలో భాగంగానే సీబీఐ, ఈడీ దాడులు జరుగుతున్నాయంటూ సిసోదియా ధ్వజమెత్తారు. మరోవైపు మద్యం కుంభకోణంలో అసలు సూత్రధారి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు.

ఇవీ చదవండి: సిసోదియాపై లుక్​ఔట్​ నోటీసులతో మరో దుమారం

2024 ఎన్నికల్లో మోదీ కేజ్రీవాల్ మధ్యే పోటీ, అందుకే సీబీఐ దాడులు

Last Updated : Aug 22, 2022, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.