ETV Bharat / bharat

దిల్లీ మద్యం కేసులో కొత్త ట్విస్ట్​.. ఈడీ చేతికి మరిన్ని సాక్ష్యాలు.. ఫోన్​ నుంచి డేటా మొత్తం.. - మనీశ్​ సిసోదియాను మద్యం కుంభకోణం కేసు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్​ సిసోదియా కస్టడీని మరో ఐదు రోజులు పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఈ విచారణలో కీలక సమాచారం లభించిందని ఈడీ.. కోర్టుకు తెలిపింది.

Delhi excise policy case
Delhi excise policy case
author img

By

Published : Mar 17, 2023, 7:34 PM IST

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాకు చుక్కెదురైంది. ఆయన కస్టడీని మరో ఐదు రోజుల పాటు పొడిగిస్తూ రౌస్‌ అవెన్యూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో సిసోదియా మార్చి 22 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు.
అంతకుముందు.. సిసోదియా కస్టడీని 7 రోజులు పొడిగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దీనిని మనీశ్‌ సిసోదియా వ్యతిరేకించారు. తనను రోజూ 30 నిమిషాల నుంచి ఒక గంట మాత్రమే ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఏడు నెలల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థలు తనను విచారిస్తున్నాయని.. అయితే ఇప్పటి వరకు అవి ఏం సాధించలేకపోయాయని చెప్పారు. వాదనలు విన్న కోర్టు.. సిసోదియా కస్టడీని 5 రోజులు పొడిగించింది. దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రికి కస్టడీ పొడిగింపుపై విచారణ నేపథ్యంలో కోర్టు ఆవరణలో భారీ ఎత్తున పోలీసుల బలగాలను మోహరించారు.

విచారణలో భాగంగా.. ఇతర నిందితులు రాహుల్​ సింగ్​, దినేశ్​, అమిత్​తో జరిగిన విచారణలో కీలక సమాచారం లభించిందని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ సమాచారంతో పాటు సిసోదియా ఫోన్​, మెయిల్, ఇతర వస్తువుల నుంచి పెద్ద ఎత్తున డేటా కూడాను స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. వీటిని ఫోరెన్సిక్​ పరిశీలనకు పంపించామని పేర్కొంది. అంతకుముందు జరిగిన విచారణలో సిసోదియా ఉద్దేశపూర్వకంగానే సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించారని ఈడీ కోర్టుకు విన్నవించింది. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ పిటిషన్​ను వ్యతిరేకించిన సిసోదియా తరఫు న్యాయవాది.. కస్టడీ పొడిగించడానికి సరైన కారణం లేదని తెలిపారు. అంతకుముందు ఇచ్చిన ఏడు రోజుల కస్టడీలో కేవలం నలుగురితో మాత్రమే కలిసి విచారించారని చెప్పారు.

'ఉగ్రవాది కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు'
మనీశ్ సిసోదియా కస్టడీ పొడిగింపుపై ఆప్​ మండిపడింది. సిసోదియాతో ఉగ్రవాది కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆ పార్టీ నాయకుడు సంజయ్​ సింగ్​ విమర్శించారు. సరైన ఆధారాలు లేక దర్యాప్తు సంస్థలు కట్టు కథలు అల్లుతూ.. అవే ప్రశ్నలను పదేపదే అడుగుతున్నాయన్నారు రాఘవ్​ ఛద్దా. ఏడు రోజుల రిమాండ్​లో కేవలం 15 గంటలు మాత్రమే ఈడీ అధికారులు ప్రశ్నించారని ఆరోపించారు.

సిసోదియా పీఏకు సమన్లు
మద్యం కుంభకోణం కేసులో మరికొరికి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ సమన్లు జారీ చేసింది. సిసోదియా ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన దేవేంద్రకు ఈడీ తాఖీదులు పంపింది. శనివారం ఉదయం దిల్లీలోని ఎన్​ఫోర్స్​మెంట్ డైరక్టరేట్ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించింది.
మద్యం కుంభకోణం కేసులో ఫిబ్రవరి 26న సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం 27న కోర్టులో హాజరుపరచి.. కోర్టు ఆదేశాలతో సిసోదియాను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో అరెస్టైన నేపథ్యంలో.. ఫిబ్రవరి 28న మనీశ్ సిసోదియా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసు..
దిల్లీ మద్యం విధానంలో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టింది. మద్యం తయారీదారులు, టోకు, రిటైల్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా లిక్కర్ పాలసీ రూపొందించారన్నది ప్రధాన ఆరోపణ. మద్యం విధానాన్ని అధికారికంగా విడుదల చేయకముందే.. వాటి వివరాలు వ్యాపారుల వాట్సాప్ గ్రూప్​లలో ప్రత్యక్షమైందని సీబీఐ ఆరోపిస్తోంది. మరోవైపు, ఇదే కేసులో మనీలాండరింగ్​కు సంబంధించిన ఆరోపణలపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరెట్ విచారణ చేపట్టింది.

ఇవీ చదవండి : 'నెహ్రూ' ఇంటి పేరుపై రగడ.. మోదీకి కాంగ్రెస్​ ప్రివిలేజ్​ నోటీసులు

మందు బాబులకు షాక్​.. బాటిల్​పై రూ.10 'మిల్క్​ సెస్'.. స్కూటీపై రూ.25వేలు సబ్సిడీ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.