Delhi Covid Restrictions: కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దిల్లీలో ఆంక్షలను సడలించింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం అమలులో ఉన్న వారాంతపు కర్ఫ్యూను ఎత్తివేసింది. దుకాణాలపై ఉన్న సరి-బేసి విధానాన్ని కూడా తొలగిస్తున్నట్లు గురువారం వెల్లడించింది. దీంతో పాటు నగరంలోని రెస్టారెంట్లు, బార్లకు 50 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతించింది. అయితే పాఠశాలల పునఃప్రారంభంపై మాత్రం తదుపరి చర్చల్లో నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ కార్యాలయాలు కూడా 50 శాతం సామర్థ్యంతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు పెళ్లి వేడుకలకు సంబంధించి విధించిన ఆంక్షలపై కూడా సడలింపులు చేసింది దిల్లీ ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో జరిగే పెళ్లి వేడుకలకు అత్యధికంగా 200 అతిథులు హాజరు కావచ్చని స్పష్టం చేసింది. ఇండోర్ వెన్యూలలో 50 శాతం సామర్థ్యంతో వేడుకలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.
ప్రస్తుతం నగరంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు అమలులో ఉన్న రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: అరుణాచల్ యువకుడు ఇంటికి.. భారత్కు అప్పజెప్పిన చైనా..