ETV Bharat / bharat

బైక్​ను ఢీకొట్టిన కారు.. ఎగిరివచ్చి రూఫ్​పై పడ్డ వ్యక్తి.. 3కిమీ ఈడ్చుకెళ్లి.. - బైక్‌ను ఢీకొట్టి బాడీతో 3 కి మీ ఈడ్చుకెళ్లిన కారు

బైక్​ను కారుతో ఢీ కొట్టాడు ఓ వ్యక్తి​. అనంతరం బాధితుడ్ని మూడు కిలోమీటర్ల వరకు కారుతో ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. ఓ వ్యక్తి మృతిచెందాడు. మరో వ్యక్తి చికిత్స పొందుతున్నాడు.

delhi-car-drag-accident-car-crashes-bike-and-drives-for-3-km-with-body-on-roof
బైక్​ ఢీకొట్టిన కారు
author img

By

Published : May 3, 2023, 7:29 PM IST

బైక్​పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ఢీ కొట్టాడు ఓ డ్రైవర్​. బాధితుల్లో ఒకరు వ్యక్తి వచ్చి కారు రూఫ్​పై పడ్డా.. పట్టించుకోకుండా వాహనాన్ని అలాగే ముందుకు పోనిచ్చాడు కారు డ్రైవర్. దాదాపు మూడు కిలోమీటర్ల వరకు బాధితుడ్ని అలాగే ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏప్రిల్​ 29న దేశ రాజధాని దిల్లీలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కస్తూర్బా గాంధీ రోడ్డు మార్గంలో దీపాంశు వర్మ(30), అతని కజిన్​ ముకుల్ వర్మ (20) ఏప్రిల్​ 29 రాత్రి బైక్​పై వెళుతున్నారు. అదే సమయంలో ఓ ఎస్​యూవీ వారిని ఢీకొట్టింది. దీంతో ముకుల్ రోడ్డుపై పడ్డాడు. దీపాంశు ఎగిరివచ్చి కారు రూఫ్​పై పడ్డాడు. అయినా కారు డ్రైవర్​.. వాహనాన్ని అలాగే పోనిచ్చాడు. దీన్ని గమనించిన తోటి వాహనదారులు హారన్ కోడుతూ, కేకలు వేస్తూ.. కారును ఆపేందుకు ప్రయత్నించారు.

తోటి వాహనదారులు హెచ్చరికలు వినిపించుకోని డ్రైవర్.. కారును అలాగే పోనిచ్చాడు. ఎలాగోలా కారును ఆపిన తోటి వాహనదారులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే దీపాంశు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుడు హర్నీత్ సింగ్ చావ్లాను ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని వారు పేర్కొన్నారు.

delhi car drag accident Car crashes bike and drives for 3 km with body on roof
కారు రూఫ్​పై బాధితుడు

కారు బానెట్​పై కానిస్టేబుల్​.. కి.మీ లాక్కెళ్లిన దుండగులు.. ఆఖరికి..
రెండు వారాల క్రితం పంజాబ్‌లోని లుథియానాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు దుండగులు.. ట్రాఫిక్​ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టారు. కారు బానెట్‌పై పడ్డ ఆయనను సుమారు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లారు. వాహనం ఆపాల్సిందిగా సూచించిన కానిస్టేబుల్‌పై ఆ దారుణానికి పాల్పడ్డారు. స్థానిక మాతా రాణి చౌక్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి.

విధుల్లో ఉన్న ట్రాఫిక్​ కానిస్టేబుల్‌ హర్దీప్‌సింగ్‌.. వేగంగా వస్తున్న ఓ కారును ఆపాలని సూచించారు. కారు నడిపే వ్యక్తి వాహనాన్ని ఆపకుండా.. కానిస్టేబుల్‌ను ఢీకొట్టాడు. దీంతో కానిస్టేబుల్​ కారు బానెట్‌పై పడ్డారు. అనంతరం డ్రైవర్‌ కారును జలంధర్‌ బైపాస్‌ దిశగా దాదాపు కిలోమీటరు దూరం పోనిచ్చాడు. ఆ దారిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కారు వేగాన్ని సడెన్​గా తగ్గించాడు. దీంతో కానిస్టేబుల్​ హర్దీప్‌సింగ్‌ కిందపడ్డాడు. వెంటనే వాహనం నడిపిన డ్రైవర్‌, అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.