దిల్లీలో కొవిడ్ రోగుల కోసం 'ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్' రైళ్లు కావాలని కేజ్రీవాల్ సర్కార్ కోరినట్టు రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ అరోరా వెల్లడించారు. ఇదే తరహాలో ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నుంచీ అభ్యర్థనలు వచ్చాయని ఆయన తెలిపారు.
"ప్రాణవాయువు సరఫరా కోసం దిల్లీ నుంచి అభ్యర్థన అందింది. అందుకు సంబంధించిన ప్రణాళికను మేం సిద్ధం చేస్తున్నాం. రవూర్కెలా కర్మాగారాం నుంచి మాకు ఆక్సిజన్ అందుబాటులో ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు.. అంగూల్(ఒడిశా) నుంచి ప్రాణవాయువు సరఫరా చేయాలని కోరింది."
- సునీత్ అరోరా, రైల్వే బోర్డు ఛైర్మన్
ప్రస్తుతం మహారాష్ట్రకు వెళ్తున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్.. శుక్రవారం రాత్రికి నాగ్‌పుర్‌కు చేరుకుంటుందని సునీత్ తెలిపారు. మరో రైలు శనివారం లఖ్‌నవూకు వెళ్తుందని ఆయన చెప్పారు.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రతి ట్యాంకర్లో 16 టన్నుల ప్రాణవాయువు నిల్వ చేయొచ్చని సునీత్ తెలిపారు. ఇవి గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'మే 15కు కరోనా ఉగ్రరూపం.. ఆ తర్వాత...'