ETV Bharat / bharat

వేధింపులు భరించలేక యువ జంట ఆత్మహత్య.. కుక్కల దాడిలో చిన్నారి మృతి - విద్యార్థుల బ్యాగుల్లో కాండోమ్స్​

అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. బంగాల్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు, తోటి విద్యార్థికి మద్యం తాగించి నగ్నంగా వీడియో తీశారు ముగ్గురు యువకులు. ఆపై అతడి నుంచి రూ.60వేలు డిమాండ్​ చేశారు.

BBA students record nude video
BBA students record nude video
author img

By

Published : Dec 1, 2022, 10:59 AM IST

అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంగాల్​లోని దుర్గాపుర్​లో జరిగింది. మృతి చెందిన యువతి గర్భిణి కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

స్థానికుల కథనం మేరకు... దుర్గాపుర్​లోని బబ్నాబేరా ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల ఆకాశ్​ అకురా, పంపా రుయిడాస్​ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. రెండేళ్ల క్రితం పెద్దలు అయిష్టంగానే వీరి పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి ఆ యువతికి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. ఆమెను పుట్టింటి వారితో మాట్లాడనివ్వకుండా చేయడమే కాకుండా ఇంట్లోనూ ఎంతో వేధించేవారు. ఇటీవలే తాను గర్భవతి అయ్యానన్న విషయం అత్తింట్లో తెలపగా ఆ యువతికి వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో విస్తుపోయిన ఆకాశ్​ ఇక తమ వల్ల కాదని తన ముడునెలల గర్భిణీ భార్యతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

యువకుడి నగ్న వీడియోలు తీసి..
ఉత్తరాఖండ్​లోని దెహ్రాదూన్​లో ఓ అమానవీయ ఘటన వెలుగుచూసింది. డబ్బు మీద ఆశతో తోటి విద్యార్థులంతా చేరి ఓ యువకుడిని దారుణంగా హింసించారు. అతన్ని నగ్నంగా చిత్రీకరించి బ్లాక్​మెయిల్​కు చేశారు. విషయం పోలీసులకు తెలియగా.. ఆ యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే వారు పరారీలో ఉన్నందున వారి ఆచూకీ కోసం గాలింపులు చేపడుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం...
దెహ్రాదూన్​లోని ఓ కళాశాలలో బీబీఏ చదువుకుంటున్న ఆకార్ష్​ గుప్తా, జెరిమీ మాలిక్​ సమన్​జోయ్​ ఆంటోనీలు నవంబర్​ 27న తన తోటి విద్యార్థి రూమ్​లోకి వెళ్లారు. అతనితో బలవంతంగా మద్యం తాగించి ఆపై నగ్నంగా వీడియో తీశారు. మత్తులో ఉన్న ఆ విద్యార్థిని బెదిరించిన యువకులు అతన్ని 60 వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్​ చేశారు. ప్రతిఘటించిన బాలుడు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా ఆ ముగ్గురు పరారయ్యారు.

ఆడుకునేందుకు వచ్చిన చిన్నారిపై దాడి చేసిన కుక్కల గుంపు...
సరదాగా ఆడుకునేందుకు బయటికి వచ్చిన ఓ నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. బాలుడి కేకలు విన్న తల్లిదండ్రులు హుటాహుటిన చేరుకుని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ఇంట విషాదం నెలకొంది. కర్ణాటక శివమొగ్గలో ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే
శివమొగ్గలోని దాదామఘట్టా గ్రామంలో సయ్యాద్​ మదానీ అనే నాలుగేళ్ల చిన్నారి బుధవారం సాయంత్రం సరదాగా ఆడుకునేందుకు బయటకు వచ్చాడు. ఇంతలోనే అతనిపై కొన్ని కుక్కలు దాడికి దిగాయి. దీంతో భయపడ్డ చిన్నారి కిండ పడిపోగా అతన్ని కొరికి కొంత దూరానికి లాక్కుని వెళ్లాయి. కుక్కల అరుపులు విని బయటికి వచ్చిన బాలుడి కుటుంబసభ్యులు ఆ ఘటనను చూసి షాక్​కు గురయ్యారు. వెంటనే ఒ కట్టె తీసుకుని ఆ వీధి కుక్కలను తరిమారు. అంతలోపే ఆ చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యి మెదడు బయటకి వచ్చింది. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు.

విద్యార్థుల బ్యాగుల్లో కండోమ్స్​...
విద్యార్ధులు స్కూళ్లకు సెల్​ఫోన్లు ​తీసుకొస్తున్నారని కర్ణాటకలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల అనుబంధ నిర్వహణకు ఉపాధ్యాయుల ఫిర్యాదు చేయగా.. బెంగళూరులోని పిల్లల బ్యాగులను తనిఖీ చేసిన యాజమాన్యం షాక్​కు గురయ్యింది. వారి బ్యాగుల్లో కండోమ్స్, సిగరెట్స్, గర్భనిరోధకాలు, వైట్నర్స్​ దొరికాయి. ఈ వస్తువులు ముఖ్యంగా 8,9,10వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో లభించడం తీవ్ర కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే..
బెంగళూరులోని పలు పాఠాశాలల్లో విద్యార్థులు స్కూళ్లకు ఫోన్లు తెస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు కర్ణాటక ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా వారు.. తనిఖీలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రోటీన్ చెక్​లో విద్యార్థుల బ్యాగుల నుంచి కండోమ్స్​, వైట్నర్స్​ లాంటి వస్తువులు బయటపడ్డాయి. విద్యార్థులను ఈ విషయమై ఆరా తీయగా వారు సరదా కోసమే ఇదంతా చేస్తున్నామని ఎటువంటి సంకోచం లేకుండా చెప్పారు. అయితే ఈ విషయన్ని బయటకు పొక్కనివ్వకూడదని నిర్ణయించుకున్న యాజమాన్యం వారికి 10 రోజుల సెలవులిచ్చి వారితో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.