118 ఎమ్‌బీటీ(మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్) అర్జున ట్యాంకులు భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి(arjun mk1a tank). ట్యాంకుల కొనుగోలుకు ఈమేరకు ఒప్పందం కుదుర్చుకుంది భారత రక్షణశాఖ(defence news india). దీని విలువ రూ. 7,523కోట్లు.
చెన్నైకు చెందిన హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీకి అర్జున ఎమ్కే-1ఏ కోసం ఆర్డర్లు ఇచ్చింది రక్షణశాఖ. ఇందులో అత్యాధునిక సాంకేతికత ఉంటుంది. ఎమ్కే-1 వేరియంట్‌తో పోల్చుకుంటే ఇందులో 72 ఫీచర్లు అదనంగా ఉండనున్నాయి. ఏ ప్రదేశంలోనైనా సులభంగా ప్రయాణించే వెసులుబాటు యుద్ధ ట్యాంకుల్లో ఉంది.
రక్షణ రంగంలో 'మేక్ ఇన్ ఇండియా'కు ఈ ఆర్డర్లు మరింత ఊతమందిస్తాయని రక్షణశాఖ ప్రకటించింది(atmanirbhar bharat defence sector).
ఇదీ చూడండి:- Indian Air Force: వాయుసేనకు 56 రవాణా విమానాలు