అమెరికాతో భారత్ రూ.423 కోట్ల రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత నావికాదళం కోసం ఎంకే 54 టార్పెడో(Mk 54 Torpedo India) ఆయుధాలను అమెరికా నుంచి దిగుమతి చేసుకోనుంది. ఈ ఆయుధాలు పీ-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ఉపయోగించనున్నారు. ఇది ముందస్తు సముద్ర నిఘా సామర్థ్యాలకు ఉపయోగ పడుతుంది.
భారత నావికా దళం మొత్తం 11 పీ-8ఐ విమానాలను కలిగి ఉండగా... వీటిని US ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ తయారు చేసింది. ఈ తాజా ఒప్పందం గురించి రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు.. ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఇదీ చూడండి: DRDO Abhyas test: 'అభ్యాస్' పరీక్ష విజయవంతం