Bank Employee suicide: అప్పుల బాధతో ఓ బ్యాంకు ఉద్యోగి తన భార్య పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది.
Bank employee killed wife
చెన్నై దగ్గర పెరుంగుడి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మణికందన్.. తన భార్య తారా(35), ఇద్దరు కుమారుల(తరణ్(10), దహన్(1))తో కలిసి నివసిస్తున్నాడు. పొరూర్లోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న మణికందన్‌కు.. చాలా అప్పులు ఉన్నాయని స్థానికులు చెప్పారు. రెండు నెలలుగా ఉద్యోగానికి కూడా వెళ్లడం లేదని తెలిపారు. దీంతో ఇంట్లో భార్యా, భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, డిసెంబర్ 31న దంపతుల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరిందని వివరించారు. ఆ కోపంలో భార్యను, ఇద్దరు కొడుకులను చంపి.. మనికందన్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.
ఘటనపై సమాచారం అందుకున్న తొరైపక్కమ్ పోలీసులు ఘటనా స్థలి నుంచి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టం కోసం మృతదేహాలను రోయపెట్ట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అప్పుల సమస్యల వల్లే ఇంట్లో తగాదాలు జరిగేవని పోలీసులు నిర్ధరించారు. మణికందన్ ఆన్లైన్ గేమ్‌లు ఆడి చాలా డబ్బులు పోగొట్టుకున్నాడని తెలిపారు.
ఇదీ చదవండి: 60 మేకలు, వందల కిలోల రైస్‌తో అదిరే విందు- మహిళలకు నో ఎంట్రీ!