ETV Bharat / bharat

'వలంటీరు మృతికి టీకాతో సంబంధం లేదు'

కరోనా వ్యాక్సిన్​ తుది దశ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వ్యక్తి 9 రోజుల తర్వాత చనిపోయాడు. అయితే.. ఈ మరణానికి తమ టీకాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది వ్యాక్సిన్​ తయారీ సంస్థ భారత్​ బయోటెక్​.

Death of vaccine volunteer
భారత్​ బయోటెక్​
author img

By

Published : Jan 10, 2021, 5:27 AM IST

కొవిడ్​-19 టీకా మూడో దశ క్లినికల్​ ప్రయోగాల్లో పాల్గొన్న ఓ వ్యక్తి 9 రోజుల తర్వాత మరణించాడు. అయితే ఈ మరణానికి టీకాతో సంబంధం లేదని వ్యాక్సిన్​ తయారీ సంస్థ భారత్​ బయోటెక్​ తెలిపింది.

క్లినికల్​ ప్రయోగాల్లో భాగంగా భోపాల్​లోని పీపుల్స్​ మెడికల్​ కాలేజీ అండ్​ హాస్పిటల్​లో సదరు వ్యక్తి (42) గత నెల 12న టీకా పొందాడు. అదే నెల 21న అతడు చనిపోయాడని ఆ విద్యా సంస్థ ఉపకులపతి రాజేశ్​ కపూర్​ చెప్పారు. గుండె, ఊపిరి ఆగిపోవడం వల్ల అతడు మరణించి ఉంటాడని, దీనికి విష ప్రయోగం కారణమై ఉండొచ్చని శవపరీక్ష నిర్వహించిన వైద్యుడు పేర్కొన్నట్లు మధ్యప్రదేశ్​ మెడికో లీగల్​ ఇన్​స్టిట్యూట్​ డైరెక్టర్​ అశోక్​ శర్మ తెలిపారు.

" వ్యాక్సిన్​ తీసుకున్న 9 రోజుల తర్వాత ఆ వలంటీర్​ చనిపోయాడు. టీకాతో దానికి సంబంధం లేదని ప్రాథమిక వివరాలు చెబుతున్నాయి. దీనికి తోడు అతడికి వేసింది నిజమైన టీకానా లేక ఉత్తుత్తి ఔషధమా అన్నది కూడా తెలియదు. ఇది బ్లైండెడ్​ తరహా క్లినికల్​ ప్రయోగం"

- భారత్​ బయోటెక్​

ఇదీ చూడండి: జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్​ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.