బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ పేలిన కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపుర్ జిల్లా చౌమూలో శుక్రవారం జరిగింది. మృతుడు ఉదయ్‌పుర గ్రామానికి చెందిన రాకేశ్ నాగర్‌గా పోలీసులు గుర్తించారు.
ఇయర్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసుకుని రాకేశ్ కాల్ మాట్లాడుతున్న సమయంలో అవి పేలాయి. దీంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడు.

ఇయర్‌ఫోన్స్ పేలిన సమయంలో అతనికి గుండెపోటు వచ్చి ఉంటుందని.. ఆ కారణంగానే రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు భావిస్తున్నారు. దేశంలో ఈ తరహా ఘటన ఇదే తొలిసారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : 30 ఏళ్లు శ్రమించి ఊరికి రోడ్డేసిన అన్నదమ్ములు