ETV Bharat / bharat

మరో సింగిల్​ డోస్​ కరోనా టీకాకు కేంద్రం అనుమతి

sputnik v light vaccine: భారత్​లో మరో కరోనా వ్యాక్సిన్​కు అనుమతులు లభించాయి. స్పుత్నిక్​ లైట్​ సింగిల్​ డోస్​ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిందని తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయ.

vaccine
స్పుత్నిక్​ టీకా
author img

By

Published : Feb 6, 2022, 9:53 PM IST

sputnik v light vaccine: దేశంలో మరో సింగిల్​ డోసు కరోనా వ్యాక్సిన్​కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. స్పుత్నిక్​ లైట్​ సింగిల్​ డోస్​ టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) అనుమతి ఇచ్చిందని తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయ. దేశంలో కరోనాపై పోరుకు ఇది మరింత దోహదపడుతుందని ఆయన ట్వీట్​ చేశారు.

తాజా అనుమతులతో దేశంలో అత్యవసర వినియోగానికి అందుబాటులో ఉన్న టీకాల సంఖ్య తొమ్మిదికి చేరింది. కొవిషీల్డ్​, కొవాగ్జిన్​, స్పుత్నిక్​-వి, మోడెర్నా, జాన్సన్​ అండ్​ జాన్సన్ (సింగిల్​ డోస్ టీకా​), జైడస్​ క్యాడిలా, కొవొవాక్స్​, కార్బెవాక్స్​లకు ఇప్పటికే అనుమతులు లభించాయి.

స్పుత్నిక్​ లైట్​ టీకా అత్యవసర వినియోగం కోసం డీసీజీఐకి జనవరి 31న సిఫార్సు చేసింది నిపుణుల కమిటీ. రెండు డోసుల స్పుత్నిక్​ వి టీకాను రూపొందించిన.. రష్యా సంస్థ ఆర్​డీఐఎఫ్​(రష్యన్​ డైరెక్ట్​ ఇన్వెస్ట్​మెంట్​ ఫండ్​) ఒకే డోసు స్పుత్నిక్​ లైట్​ టీకాను కూడా అభివృద్ధి చేసింది. స్పుత్నిక్​ లైట్​ టీకా ట్రయల్స్​ను.. భారత్​లో డాక్టర్​ రెడ్డీస్​ లాబోరేటరీస్​ చేపట్టింది.

ఏంటీ స్పుత్నిక్ లైట్?

ఒకే డోసు 'స్పుత్నిక్‌ లైట్‌' టీకాను (Sputnik vaccine India) రష్యా రూపొందించింది. దీనికి అక్కడ అత్యవసర అనుమతి లభించింది. కొవిడ్‌-19ను అదుపు చేయడంలో ఒకే డోసు టీకా 79.4% ప్రభావశీలత కనబరిచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది. ఈ టీకా తీసుకున్న వారిలో 28 రోజుల నాటికి వైరస్‌ను ఎదిరించే యాంటీ-బాడీలు తయారవుతున్నట్లు గుర్తించారు. ఇది కరోనా వైరస్‌ నూతన వేరియెంట్ల పైనా పనిచేస్తోందని సంస్థ స్పష్టం చేసింది. వివిధ దేశాల్లో కొవిడ్‌-19 తీవ్రత దృష్ట్యా ప్రజలకు తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోందని, దీనికి ఒకే డోసు టీకా మంచి పరిష్కారమని ఆర్‌డీఐఎఫ్‌ తెలిపింది.

ఇదీ చూడండి : 'వారంతా ఆఫీస్​లకు రావాల్సిందే'.. ఆ రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.