భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను 2ఏళ్ల పిల్లల నుంచి 18ఏళ్ల యువతపై ప్రయోగించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతించింది. రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్‌కు అనుమతులు ఇచ్చింది.
ఈ విషయంపై కొవాగ్జిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఇటీవలే నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. వీటిని పరిగణలోకి తీసుకున్న డీసీజీఐ తాజా నిర్ణయం తీసుకుంది.
డీసీజీఐ అనుమతితో 525 మంది ఆరోగ్యకరమైన వలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది భారత్ బయోటెక్. వంలంటీర్ల భుజానికి టీకాను ఇవ్వనున్నారు. తొలి డోసు ఇచ్చిన 28 రోజులకు రెండో డోసు అందిస్తారు.