ETV Bharat / bharat

కరోనా కోసం హెటిరో నుంచి కొత్త డ్రగ్​- ఓకే చెప్పిన డీసీజీఐ - కొవిడ్​ చికిత్స

హైదరాబాద్​కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరోకు చెందిన టొసిరా(టొసిలిజుమాబ్​)(tocilizumab injection hetero) అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం తెలిపింది. కొవిడ్​తో తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన వయోజనులకు ఈ ఔషధం(tocilizumab uses) అందించేందుకు అనుమతి లభించినట్లు ప్రకటించింది ఫార్మా సంస్థ. సెప్టెంబర్​ చివరి నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.

Hetero's Tocilizumab
టొసిలిజుమాబ్
author img

By

Published : Sep 6, 2021, 3:57 PM IST

కొవిడ్​-19 మహమ్మారితో తీవ్రంగా ప్రభావితమై ఆసుపత్రులో చేరిన రోగులకు మరో ఔషధం(tocilizumab) అందుబాటులోకి రానుంది. భారత్​లో కొవిడ్​తో ఆసుపత్రుల్లో చేరిన వయోజనులకు అందించేందుకు తమ ఔషధం టొసిలిజుమాబ్(tocilizumab injection hetero)​ అత్యవసర వినియోగానికి డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) అనుమతించినట్లు హెటిరో ఫార్మా ప్రకటించింది. తాజా నిర్ణయంతో.. తీవ్ర అనారోగ్యానికి గురై స్టెరాయిడ్స్​ అందుకుంటున్న లేదా ఆక్సిజన్​, వెంటిలేషన్​ అవసరమైన వారికి ఇచ్చేందుకు(tocilizumab uses) ఆసుపత్రులకు అధికారం లభించినట్లయిందని పేర్కొంది.

" భారత్​లో హెటిరో ఔషధం టొసిలిజుమాబ్​కు అనుమతులు రావటం సంతోషంగా ఉంది. దీని ద్వారా మా సాంకేతిక సామర్థ్యం, కొవిడ్​ నివారణలో ముఖ్యమైన ఔషధాల ఉత్పత్తిలో మా నిబద్ధత నిరూపితమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధానికి కొరత ఉంది. ఈ క్రమంలో భారత్​లో అనుమతులు రావటం సరఫరా భద్రతకు కీలకంగా మారనుంది. సమానంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం. "

- డాక్టర్​ బి.పార్థ సారధి రెడ్డి, హెటిరో గ్రూప్​ ఛైర్మన్​

హెటిరో టోసిరా(టొసిలిజుమాబ్​) ఔషధాన్ని తమ భాగస్వామ్య సంస్థ హెటిరో హెల్త్​కేర్​ ద్వారా దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నట్లు తెలిపారు ఛైర్మన్​. హైదరాబాద్​ జడ్చర్లలోని హెటిరో బయోఫార్మాలో ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్​ చివరి నటికి మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: 'టొసిలిజుమ్యాబ్‌'తో కరోనా రోగులకు ప్రయోజనమెంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.