ETV Bharat / bharat

కొవిడ్​-19కు కొత్త ఔషధం 'విరాఫిన్​'

author img

By

Published : Apr 23, 2021, 3:35 PM IST

Updated : Apr 24, 2021, 7:19 AM IST

Zydus Cadila gets USFDA nod to market anti-arrhythmic drug
కొవిడ్​-19కు కొత్త ఔషధం 'విరాఫిన్​'

15:33 April 23

కొవిడ్​-19కు కొత్త ఔషధం 'విరాఫిన్​'

కొవిడ్‌-19 వ్యాధికి ఒక కొత్త ఔషధాన్ని క్యాడిలా హెల్త్‌కేర్‌ దేశీయ మార్కెట్లోకి తీసుకురానుంది. యాంటీ- వైరల్‌ తరగతికి చెందిన విరాఫిన్‌ (పెగిలేటెడ్‌ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా-2బి) అనే ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) 'అత్యవసర అనుమతి' మంజూరు చేసింది. కొవిడ్‌-19 వ్యాధి ప్రారంభ దశలోనే ఈ మందు తీసుకున్న పక్షంలో త్వరగా కోలుకోవడంతో పాటు, ఆరోగ్యం విషమించే అవకాశాలు ఉండవని క్యాడిలా హెల్త్‌కేర్‌ వెల్లడించింది.

ఆక్సిజన్​ అవసరమే లేదు..

డాక్టర్ల సిఫారసుపై ఆసుపత్రుల్లోనే ఈ మందు లభిస్తుందని పేర్కొంది. ఈ మందుపై దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో వైద్యపరీక్షలు నిర్వహించినట్లు క్యాడిలా హెల్త్‌కేర్‌ వెల్లడించింది. విరాఫిన్‌ ఔషధం వాడితే ఆక్సిజన్‌ తీసుకోవాల్సిన అవసరం అసలు కనిపించలేదని, ఇతర వైరల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా ఇది రక్షణ కల్పించినట్లు ఈ పరీక్షల్లో నిర్థారణ అయిందని పేర్కొంది. కొవిడ్‌-19 బారిన పడిన వారికి ఈ మందుతో చికిత్స చేసి, 7వ రోజున ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష చేస్తే.. 91.15 శాతం మందికి కొవిడ్‌-19 'నెగిటివ్‌' వచ్చినట్లు వివరించింది.

వైరస్‌ వ్యాధులను ఎదుర్కోవడంలో మనిషి శరీరంలో ఉండే టైప్‌-1 ఇంటర్‌ఫెరాన్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. మనిషికి వయస్సు మీద పడే కొద్దీ ఇంటర్‌ఫెరాన్‌ ఆల్ఫా ఉత్పత్తి తగ్గిపోయి, వైరస్‌ వ్యాధులను ఎదిరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. వయస్సు మీరిన వారికి కొవిడ్‌-19 వస్తే ప్రాణాపాయం అధికంగా ఉండటానికి ప్రధాన కారణం ఇదే.

కొవిడ్‌-19 వ్యాధి తీవ్రత ఎంతో అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 'విరాఫిన్‌' ఔషధంతో ఎంతో మందికి మేలు జరుగుతుందని క్యాడిలా హెల్త్‌కేర్‌ ఎండీ డాక్టర్‌ శార్విల్‌ పటేల్‌ పేర్కొన్నారు. 

Last Updated : Apr 24, 2021, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.