మహారాష్ట్రలో తాజాగా 51,751 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 34,58,996కి చేరింది. మరో 258 మంది కరోనాకు బలయ్యారు. ఒక్కరోజే 52,312 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,64,746 యాక్టివ్ కేసులున్నాయి.
దిల్లీలో..
దిల్లీలో ఒక్కరోజే 11,491 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 7,36,688కు చేరింది. మరో 72మంది మృతి చెందారు.
యూపీలో విజృంభణ
ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా తీవ్రత పెరుగుతోంది. తాజాగా 13,685 కేసులు వెలుగుచూశాయి. మరో 72 మంది చనిపోయారు.
కర్ణాటకలో..
కర్ణాటకలో కొత్తగా 9,579 మంది వైరస్ బారిన పడగా.. 52 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 10,74,869కు చేరింది.
తమిళనాడులో..
తమిళనాడులో కొత్తగా 6711 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 19 ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,40,145కు చేరింది.
కేరళలో మరో 5,692 కేసులు బయటపడ్డాయి. తాజాగా 11 మంది కరోనాతో మరణించారు.
రాష్ట్రం | తాజా కేసులు | తాజా మరణాలు |
బంగాల్ | 4,511 | 14 |
గుజరాత్ | 6,021 | 55 |
పంజాబ్ | 3,477 | 52 |
హరియాణా | 3,818 | 14 |
రాజస్థాన్ | 5,771 | 25 |
ఇదీ చూడండి: కరోనా వ్యాప్తిపై ఎయిమ్స్ డైరెక్టర్ తీవ్ర హెచ్చరిక