తల్లిని బతికించకోవడానికి నోటితో ఊపిరి అందించింది ఓ కుమార్తె. ఈ సంఘటన ఉత్తర్ప్రదేశ్ బహ్రాయిచ్లో శనివారం జరిగింది.
ఏం జరిగింది?
కరోనా విజృంభణ కొనసాగుతున్న తరుణంలో.. బహ్రాయిచ్ వైద్య కళాశాలలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లోకి వచ్చే రోగులకు కూడా ప్రాణవాయువు అందటం లేదు. శనివారం.. చికిత్స కోసం ఓ మహిళను తన కుటుంబం ఇక్కడకు తీసుకువచ్చింది. అంతలో సదరు మహిళ.. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆక్సిజన్ కోసం సంప్రదించినా.. కొరత కారణంగా వారికి లభించలేదు. దాంతో అక్కడే ఉన్న ఆమె కుమార్తె.. తన నోటితో ఊపిరి అందించి తల్లిని బతికించుకుంది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో ఆ ఆస్పత్రి సిబ్బంది కలవరుపాటుకు గురయ్యారు. సదరు మహిళ వివరాలను వెల్లడించడానికి మొహం చాటేశారు. అయితే.. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం స్థిమితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరో నర్సింగ్ హోంలో ఆమె చికిత్స పొందుతోందని సమాచారం.
ఇదీ చూడండి: కరోనాపై మోదీ సమీక్ష- నీట్ వాయిదాపై చర్చ!