ETV Bharat / bharat

అత్యాచారానికి గురై కరోనా రోగి మృతి! - మహిళా కరోనా రోగిపై అత్యాచారం

బిహార్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా సోకిన ఓ మహిళ బుధవారం చనిపోయారు. అయితే ఆమెపై ఆస్పత్రి సిబ్బంది సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారని బాధితురాలి కుమార్తె ఆరోపిస్తున్నారు. హత్య, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

Daughter of gang-raped woman files FIR against hospital
అత్యాచారానికి గురైన కరోనా రోగి మృతి
author img

By

Published : May 20, 2021, 4:39 PM IST

బిహార్ పట్నాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళా కరోనా రోగి బుధవారం చనిపోయారు. అయితే ఆమెపై అత్యాచారం జరిగినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఐసీయూలో ఉన్న ఆమెపై ముగ్గురు సిబ్బంది సామూహిక అత్యచారానికి పాల్పడ్డారని బాధితురాలి కుమార్తె ఆరోపించారు. గురువారం.. ఆస్పత్రి యాజమాన్యంపై హత్య, లైంగిక వేధింపుల కేసును పెట్టారు. ఈ ఆరోపణలను ఆస్పత్రి వర్గాలు ఖండించాయి.

కొవిడ్ లక్షణాలు ఉండటం వల్ల మే 17న బాధిత మహిళను ఆస్పత్రిలో చేర్చినట్లు ఆమె కుమార్తె తెలిపారు. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వివరించారు.

వైద్యుల పాత్ర..

"అదే రోజు(మే17) మా అమ్మపై.. ఆస్పత్రిలో ముగ్గురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె నాకు స్వయంగా చెప్పారు. అప్పటినుంచి తన ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలోనే అమ్మను వెంటిలేటర్ పైకి మార్చి, డాక్టర్లు నా సంతకం తీసుకున్నారు. లేదంటే ఆమె ప్రాణాలకే ముప్పని చెప్పారు. పోలీసులకు వాంగ్మూలం ఇవ్వకూడదనే.. వైద్యులు తన గొంతులో గాలిపైపును పెట్టారని అనుమానిస్తున్నా. ఇప్పుడు, ఆమె చనిపోయిందని చెబుతున్నారు." అని బాధితురాలి కుమార్తె ఆవేదన చెందారు.

పోస్టుమార్టం..

అత్యాచారం జరిగిందా లేదా అని నిర్ధరించడానికి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు. కరోనాతోనే ఆమె చనిపోయినట్లు ఆస్పత్రి యంత్రాంగం చెబుతోందని అన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'మోదీజీ.. మరణాలు ఎందుకు పెరుగుతున్నాయి? '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.