ETV Bharat / bharat

దళిత యువతిని అపహరించి.. ఆపై అత్యాచారం - దళిత మహిళపై అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​ భదోహీ జిల్లాలో దారుణం జరిగింది. 20 ఏళ్ల యువతిని అపహరించడమే గాక, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. మరో ఘటనలో వినికిడి శక్తి సరిగా లేని ఓ మహిళపై అత్యాచారానికి ముగ్గురు వ్యక్తులు అత్యాచాారానికి పాల్పడ్డారు.

up rape
up rape
author img

By

Published : Oct 19, 2021, 12:31 AM IST

మహిళలపై లైంగిక అకృత్యాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా అతివలపై దారుణాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో పాశవిక ఘటన జరిగింది.

అసలేం జరిగిందంటే..

భదోహీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతిని.. మరో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(30) అపహరించి, అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలి తండ్రి.. జ్ఞాన్​పుర్ పోలీస్ స్టేషన్​లో ఆగస్టు 17న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు సోదాలు నిర్వహించారు. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబ సభ్యులు.. బెదిరింపులకు దిగాడు. ఈ మేరకు ఎస్​ఎస్​ఐ అభునాథ్​ కువార్ తెలిపారు. సోమవారం నిందితుడు ఓ హాస్టల్ వద్ద కనిపించగా పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలిని విడిపించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షలు నిర్వహించారు.

పశువులు కాసేందుకు వెళ్లిన మహిళపై..

ఝార్ఖండ్​లో మరో దారుణం జరిగింది. 37 ఏళ్ల వితంతువుపై ఇద్దరు హోమ్​గార్డులు అత్యాచారానికి పాల్పడ్డారు. గొడ్డా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాధిత మహిళ.. తన పొరుగింటికి చెందిన ఓ ఏడేళ్ల బాలుడిని తీసుకుని, మెహ్రామా పోలీస్ స్టేషన్ మైదానంలో పశువులు కాసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెపై ఇద్దరు హోం గార్డులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటికి చేరుకున్న తర్వాత తనపై జరిగిన ఘోరం గురించి తన తల్లికి, ఇరుగుపొరుగు వారికి బాధిత మహిళ చెప్పింది. దాంతో ఆమె బంధువులు, గ్రామస్థులు వెంటనే బ్లాక్ డెవలప్​మెంట్ అధికారి అభిషేక్ సింగ్​ వద్దకు చేరుకున్నారు. బాధిత మహిళకు వినికిడి శక్తి సైతం లేదని.. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నామని డీఎస్పీ శంకర్ తివారీ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.