ETV Bharat / bharat

అంబులెన్స్​ కోసం రోజూ 9000 ఫోన్ కాల్స్! - మహారాష్ట్ర కరోనా వివరాలు

మహారాష్ట్రలో అంబులెన్స్ కోసం రోజూ 9000కు పైగా ఫోన్లు వస్తున్నాయని ఆరోగ్య సేవల అధికారులు వివరించారు. తాజా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పుణె సహా పలు ప్రధాన నగరాల్లో అత్యవసర వైద్య సేవలకు అభ్యర్థనలు వెల్లువెత్తున్నాయి.

daily 9000 calls in maharastra
మహారాష్ట్ర కరోనా
author img

By

Published : Apr 21, 2021, 2:22 PM IST

కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో అంబులెన్స్ సేవల కోసం అభ్యర్థనలు పెరిగిపోతున్నాయి. రోజుకు కనీసం 9,000కు పైగా ఫోన్లు వస్తున్నాయని కంట్రోల్ రూమ్ మేనేజర్ డాక్టర్. ప్రవీణ్ సాధలే తెలిపారు. దీనిని బట్టి అక్కడ కరోనా కేసుల ఉద్ధృతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

"రోజుకు 9,000-10,000 కాల్స్ వస్తున్నాయి. వీటిలో కొవిడ్ అత్యవసర బాధితులే ఎక్కువగా ఉన్నారు. వీరితో పాటు ఇతరులూ ఉన్నారు. రోగుల్లో ఇప్పుడు భయం పెరిగింది."

-డాక్టర్ ప్రవీణ సాధలే, కంట్రోల్ రూమ్ మేనేజర్

మహారాష్ట్ర అంతటా సుమారు 937 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచినట్లు డాక్టర్ ప్రవీణ సాధలే తెలిపారు. వీటిల్లో రోగులకు అవసరమైన పీపీఈ కిట్‌ల ఏర్పాటు సహా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

"అంతకుముందు ప్రమాదాలు, గర్భిణీల కోసం అత్యవసర సేవలకు సంబంధించి మాత్రమే ఎక్కువ అభ్యర్థనలు వచ్చేవి. కరోనా సంబంధిత లక్షణాలతోనూ మాకు ఫోన్లు వచ్చేవి. కానీ అవి చాలా తక్కువ."

-డాక్టర్ ప్రవీణ సాధలే

అంబులెన్స్​ కోసం ఫోన్​ చేసేవారికి 24 గంటలూ సేవలందించేందుకు కంట్రోల్ రూమ్‌ సిబ్బంది, అధికారులు నిరంతరాయంగా పనిచేస్తున్నారు.

ఇవీ చదవండి: కరోనాతో ప్రముఖ రచయిత మృతి

పుదుచ్చేరిలో లాక్​డౌన్​- మధ్యప్రదేశ్​లో కొత్త రూల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.